Advertisementt

అఖండ 2 - ఇది సరిపోతుందా

Wed 10th Dec 2025 08:41 PM
akhanda 2  అఖండ 2 - ఇది సరిపోతుందా
Akhanda 2 release teaser: Balayya spiritual thaandavam అఖండ 2 - ఇది సరిపోతుందా
Advertisement
Ads by CJ

అఖండ 2 తాండవం ఎన్నో అంచనాల నడుమ.. డిసెంబర్ 5 న విడుదల కావాల్సి ఉండగా.. లాస్ట్ మినిట్ లో సినిమా వాయిదాపడడం అభిమానులను నిరాశ పరిచింది. అంతేకాదు కొత్త డేట్ కి అంటే డిసెంబర్ 12 న వస్తే మళ్ళి అఖండ 2 తాండవం కలెక్షన్స్ ఎలా ఉంటాయి, సినిమాపై ఎంత క్రేజ్ ఉంటుంది అనేది అభిమానులను ఆందోళనపరుస్తున్న ప్రశ్న. 

అఖండ 2 రిలీజ్ డేట్ ఇచ్చారు, మరొక్క రోజులో సినిమా ప్రీమియర్స్ తో సందడి చెయ్యడానికి రెడీ అవుతుంది, అభిమానులు ఉత్సహంగా  రెడీ అవుతున్నారు. అంతా బాగానే ఉంది.. కామన్ ఆడియన్స్ కి అఖండ 2 రిలీజ్ రీచ్ అవ్వాలంటే బాలయ్య కాస్త ఈ రెండు రోజులు సినిమాని ప్రమోట్ చేసి ఉంటే బావుండేది, డిసెంబర్ 5 వరకు ప్రమోషన్స్ ఒక ఎత్తు. 

ఈ రెండు రోజులు అఖండ 2 ప్రమోషన్స్ ఒక ఎత్తు. బాలయ్య ఒక ఈవెంట్ చేసి ఉంటె మళ్లీ సినిమా పై క్రేజ్ ఉండేది. ఇప్పుడు అఖండ 2 రిలీజ్ రోజున సినిమా ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో, ఓవర్సీస్ లో రికార్డ్ కలెక్షన్స్ కొల్లగొట్టడం కూడా సమస్యగానే ఉంది, కారణం అక్కడ అన్ని థియేటర్స్ అఖండ 2 కోసం లాక్ చెయ్యలేని పరిస్థితి. 

ఇక సినిమా విడుదలకు ముందు అఖండ తాండవం నుంచి పవర్ ఫుల్ రిలీజ్ టీజర్ వదిలారు. మరి విడుదలకు ముందు ఈ టీజర్ సరిపోతుంది అని మేకర్స్ ఇలా చేసారా.. అఖండ 2 కి ఈ క్రేజ్ సరిపోతుందా.. చూద్దాం ఓపెనింగ్స్, అలాగే ప్రీమియర్స్ కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయో అనేది. 

Akhanda 2 release teaser: Balayya spiritual thaandavam:

Akhanda 2 grand release teaser out

Tags:   AKHANDA 2
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ