Advertisementt

ధురంధర్ వీక్ డేస్ లోను ఆగని జోరు

Wed 10th Dec 2025 12:16 PM
dhurandhar  ధురంధర్ వీక్ డేస్ లోను ఆగని జోరు
Dhurandhar unstoppable energy even on weekends ధురంధర్ వీక్ డేస్ లోను ఆగని జోరు
Advertisement
Ads by CJ

బాలీవుడ్ లో స్టార్ హీరో రణవీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం డిసెంబర్ 5 న విడుదలైన మొదటి రోజు అంటే ఓపెనింగ్స్ విషయంలో కాస్త డల్ గా కనిపించినా.. సెకండ్ డే నుంచే ధురంధర్ కళ్ళు చెదిరే కలెక్షన్స్ కొల్లగొడుతూ మొదటి వీకెండ్ ముగిసేసరికి 100 కోట్ల క్లబ్బులో అఫీషియల్ గా అడుగుపెట్టింది. 

అక్షయ్ ఖన్నా, ఆర్. మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ కీలక పాత్రల్లో కనిపించిన ఈచిత్రం స్టడీ గా కలెక్షన్స్ రాబడుతుంది. వీక్  డేస్ లోను దురంధర్ కలెక్షన్స్ వర్షం ఆగడం లేదు. సోమవారం కూడా ఈ చిత్రం రూ.23 కోట్లతో గట్టి వసూళ్లు రాబట్టింది. మంగళవారం నుంచి టికెట్ ధరలు ఆడియన్స్ కి అందుబాటులోకి రావడంతో కలెక్షన్స్ మరింతగా పెరిగాయి. 

రణ్‌వీర్ సింగ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచిన ధురంధర్ చిత్రం వీక్ డేస్ లోను అదే ఫ్లో కొనసాగిస్తూ అదరగొట్టేస్తుంది. నిన్న మంగళవారం డే టైమ్ లో థియేటర్స్ లో ఆక్యుపెన్సీ కనిపించకపోయినా.. ఈవెనింగ్ షోస్, నైట్ షోస్ ఫుల్ అవడం చూసి ధురంధర్ ఫైనల్ ఫిగర్ ఎక్కడిదాకా వెళ్లి ఆగుతుందో అంటూ ట్రేడ్ వర్గాలు ఇంట్రెస్టింగ్ గా మాట్లాడుకుంటున్నాయి. 

Dhurandhar unstoppable energy even on weekends:

Dhurandhar Box Office Report

Tags:   DHURANDHAR
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ