అఖండ 2 డిసెంబర్ 5 నుంచి పోస్ట్ పోన్ అయ్యి ఎంతో సస్పెన్స్ నడుమ ఎట్టకేలకు డిసెంబర్ 12న సినిమా విడుదలకు రెడీ అయ్యింది. విడుదలకు కేవలం రెండు రోజుల ముందు రిలీజ్ డేట్ లాక్ చెయ్యడంతో ఏపీ, తెలంగాణ లోని థియేటర్స్ ఓకే కానీ, ఓవర్సీస్ లో మాత్రం అఖండ 2 కి టికెట్ బుకింగ్స్ ఓపెన్ చెయ్యడం ఛాలెంజింగ్ గా మారింది.
డిసెంబర్ 11 రాత్రి నుంచే అఖండ 2 ప్రీమియర్స్ కి రెండు రాష్ట్రాల్లో సందడి మొదలైపోయింది. మరికాసేపట్లో బుక్ మై షో లో టికెట్ బుకింగ్స్ మొదలు కాబోతున్నాయి. కానీ ఓవర్సీస్ మార్కెట్‌లో అఖండ 2కి కాస్త కఠిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ముందుగా డిసెంబరు 5 రిలీజ్‌ను దృష్టిలో పెట్టుకుని బుక్ చేసిన థియేటర్లను, విడుదల వాయిదా పడడంతో ఆ థియేటర్స్ అన్నిటిని ఇతర సినిమాలకు కేటాయించేశారు.
ఇప్పుడు డిసెంబర్ 12 న అఖండ 2 రిలీజ్‌కు వచ్చేసరికి చాలా తక్కువ స్క్రీన్స్ మాత్రమే అందుబాటులో ఉన్నట్లుగా తెలుస్తుంది. చాలా రోజుల తరువాత మళ్ళీ తెరపైకి వచ్చిన ఆ ఓవర్సీస్ సంస్థకు రిలీస్ కష్టంగా మారింది. ఓవర్సీస్ లో రికార్డ్ కలెక్షన్స్ ని ఈ తక్కువ స్క్రీన్స్ తో తేవడం చాలా కష్టమైన పనే. లాస్ట్ మినిట్ లో థియేటర్లు అడ్జస్ట్ చేయడం పెద్ద ఛాలెంజ్.. అంటూ ఓ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ ఒకటి ట్వీట్ చేసింది.
అయినప్పటికీ అఖండ 2 థియేటర్స్ విషయంలో విజయం సాధించాం, మీ షెడ్యూల్స్‌కు అనుగుణంగా షోస్ ప్లాన్ చేసేందుకు మీ మద్దతు కావాలి. థియేటర్లు షో టైమ్స్ ఫైనల్ చేస్తున్నాయి. ఈ రాత్రి లేదా రేపు పూర్తి లిస్ట్ ప్రకటిస్తాం. ఫిబ్రవరి 11న USAలో గ్రాండ్ ప్రీమియర్స్ ఉంటాయి అంటూ ట్వీట్ చేసింది.




సుందర్ పిచాయ్ తో నారా లోకేష్ భేటీ 
Loading..