మన శంకర్ వరప్రసాద్ గారు చిత్రం నుంచి మెగాస్టార్ చిరు-నయనతార కలయికలో వచ్చిన ఫిస్ట్ సింగిల్ మీసాల పిల్లా ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసి ఎన్ని మిలియన్ వ్యూస్ రాబట్టిందో చూసారు. నయనతార తో చిలిపిగా చిరు వేసిన స్టెప్స్ మీసాల పిల్ల సాంగ్ కి హైలెట్ అవడమే కాదు సాంగ్ లిరిక్స్ కూడా మూవీ లవర్స్ ని ఆకట్టుకున్నాయి
అదే ఊపులో మన శంకర్ వరప్రసాద్ గారు నుంచి రీసెంట్ గా సెకండ్ సింగిల్ శశిరేఖ వచ్చింది. నయనతార, చిరు లుక్స్ విషయంలో అభిమానులు ఫుల్ హ్యాపీ. కానీ శశిరేఖ మాత్రం మీసాల పిల్ల మాదిరి అంత వైబ్ ఇవ్వలేదు. మీసాల పిల్ల ఎంతగా వైరల్ అయ్యిందో శశిరేఖ సాంగ్ అంత డల్ గా కనిపిస్తుంది.
మరి సోషల్ మీడియాలో మీసాల పిల్ల అంటూ చిన్న పెద్ద డాన్స్ చేస్తూ దానిని వైరల్ చెయ్యగా శశిరేఖ విషయంలో ఎలాంటి హడావిడి కానీ ఆ పాట వైరల్ అయిన సందర్భం కానీ కానరావడం లేదు. కేవలం మెగాస్టార్ లుక్స్, నయనతార లుక్ ఈ పాట కు హైలెట్ అంతే.. ఇంకేం స్పెషల్ లేదు, అందుకే ఆ పాట వైరల్ అవ్వలేదు అంటున్నారు.




అఖండ 2 కన్ఫర్మేషన్ లేదు కానీ.. 
Loading..