అఖండ 2 రిలీజ్ డిసెంబర్ 12 అంటూ ఈరోజు ఉదయం నుంచి వార్తలు వినిపించడమే కానీ మేకర్స్ నుంచి ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు. అఖండ 2 కోర్టు వివాదం సద్దుమణిగింది, రిలీజ్ కి లైన్ క్లియర్ అంటూ ఉదయం నుంచి ఒకటే వార్తలు, కానీ అఖండ 2 రిలీజ్ డేట్ ని మేకర్స్ అఫీషియల్ గా వదల్లేదు.
డిసెంబర్ 12 న రిలీజ్ అనడంతో మిగతా సినిమాలు ముఖ్యంగా సుమ కనకాల కొడుకు రోషన్ నటించిన మోగ్లీ ని వాయిదా వేసుకున్నారు. అఖండ 2 తో పాటుగా సినిమాని విడుదల చెయ్యలేమంటూ దర్శకుడు సందీప్ రాజ్ అది తన బ్యాడ్ లక్ అంటూ ఎమోషనల్ గా పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది.
అఖండ 2 నిర్మాతలు అన్ని క్లియర్ అయినా ముహూర్తం చూసుకుని సినిమా విడుదల డిసెంబర్ 12 రిలీజ్ అంటూ ప్రకటిస్తారని అందరూ ఎదురు చూస్తున్నారు. మరా క్షణం ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ.. డిసెంబర్ 12 న విడుదల కాబోయే సినిమాలు ఫుల్ గా ప్రమోషన్స్ చేసుకుని ఇలా వాయిదా వేసుకోవడం పట్ల చాలా నిరాశపడిపోతున్నాయి.




ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ ఫిక్సైందా
Loading..