పలాష్ ముచ్చల్ తో వివాహాన్ని రద్దు చేసుకున్న మహిళా క్రికెటర్ స్మృతీ మందన ప్రస్తుతం తన ప్రాక్టీస్ మొదలు పెట్టింది. పెళ్లి రద్దయ్యింది, తండ్రి హాస్పిటల్ నుంచి వచ్చాక దిగులు కానీ, డిప్రెషన్ లోకి కానీ వెళ్లకుండా స్మృతి మందన ఇలా తన క్రికెట్ ప్రాక్టీస్ మొదలు పెట్టడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది.
పలాష్ ముచ్చల్ తో నవంబర్ 23 న జరగాల్సిన స్మృతి మందన వివాహం అప్పుడు వాయిదాపడింది. వీరి పెళ్లి ఆగిపోయింది, అందుకే స్మృతీ మందాన తన వివాహానికి సంబందించిన ప్రీ వెడ్డింగ్ గుర్తులు చెరిపేసింది, ఎంగేజ్మెంట్ రింగ్ కూడా తీసేసింది, పలాశ ముచ్చల్ వేరే ఎఫ్ఫైర్ పెట్టుకోవడంతో కలత చెందిన స్మృతి మందన తన వివాహాన్ని రద్దు చేసుకుంది అనే ప్రచారం జరిగింది.
అయితే కొన్ని కారణాల వలన పెళ్లిని రద్దు చేసుకుంటున్నట్లుగా ప్రకటించిన స్మృతి మందన ఇంకా పలాష్ ముచ్చల్ లు ఇరు కుటుంబాల గౌరవాన్ని కాపాడాలంటూ రిక్వెస్ట్ కూడా చేసారు. ఇక పెళ్లి రద్దు చేసుకున్న తర్వాత స్మృతి ఇలా ప్రాక్టీస్ కోసం మైదానంలోకి దిగడంతో ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.




ప్రభాస్ తప్ప అందరూ 
Loading..