ప్రస్తుతం నారా లోకేష్ అమెరికా పర్యటనలో ఉన్నారు. అక్కడ పార్టీ కార్యకర్తలతోను, అలాగే ఎన్నారై టీడీపీ కార్యకర్తలను లోకేష్ మీటవుతున్నారు. అంతేకాకుండా ఏపీకి పలు అభివృద్ధి పనుల కోసం ఆయన పెట్టుబడులను అర్షరించేందుకు పలు కంపెనీ అధినేతలను కలుస్తున్నారు. అమెరికా పర్యటనలో భాగంగా నారా లోకేష్ రెండోరోజు సెలెస్టా విసి మేనేజింగ్ పార్టనర్ అరుణ్ కుమార్ తో భేటీ అయ్యారు.
అలాగే క్రియేటివ్ ల్యాండ్ వ్యవస్థాపకుడు సజన్ రాజ్ కురుప్ తో లోకేష్ భేటీ అయ్యారు. వరసగా కంపెనీ ప్రతినిధులను కలుస్తున్న లోకేష్ తాజాగా ఓప్స్ ర్యాంప్ సీఈవో వర్మతో భేటీ అవడమే కాకుండా శాన్ ఫ్రాన్సిస్కో కాన్సులేట్ జనరల్ శ్రీకర్ రెడ్డితో, ఆటో డెస్క్ చీఫ్ టెక్నాలజిస్ట్ దేవ్ పటేల్ తో, జడ్ స్కాలర్ సీఈవో జే చౌదరితో , సేల్స్ ఫోర్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రమేష్ తో, ఏఎండీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వంశీతో , రిగెట్టి కంప్యూటింగ్ సిటిఓ డేవిడ్ రివాస్ తో మంత్రి నారా లోకేష్ వరసగా భేటీ అయ్యి ఏపీ కి పెట్టుబడులను ఆకర్షిస్తున్నారు.




పెళ్లి రద్దు-ప్రాక్టీస్ మొదలెట్టిన స్మృతి మంధన 
Loading..