Advertisementt

కాంత ఓటీటీ డేట్ వచ్చేసింది

Mon 08th Dec 2025 11:05 AM
kaantha  కాంత ఓటీటీ డేట్ వచ్చేసింది
Netflix Confirms Kaantha OTT Release Date కాంత ఓటీటీ డేట్ వచ్చేసింది
Advertisement
Ads by CJ

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ లేటెస్ట్ చిత్రం కాంత. ఈ చిత్రం నవంబర్ లో విడుదలైంది. మంచి అంచనాల నడుమ ఆడియన్స్ ముందుకు వచ్చిన కాంత చిత్రం ఆడియన్స్ అంచనాలు అందుకోవడంలో తడబడింది. దుల్కర్ సల్మాన్ నటన మెచ్చుకున్నా బోలెడన్ని మైనస్ లు సినిమాని కిల్ చేసాయి. 

సెల్వమణి సెల్వరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది. సముద్రఖని, రానా కీలక పాత్రల్లో కనిపించారు. థియేటర్స్ లో డిజప్పాయింట్ చేసిన కాంత చిత్ర ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఫ్యాన్సీ డీల్ తో దక్కించుకుంది. 

అయితే కాంత చిత్రాన్ని డిసెంబర్ 12 నుంచి స్ట్రీమింగ్ లోకి తీసుకురానున్నట్లుగా నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. సో ఈ వారమే కాంత నెట్ ఫ్లిక్స్ నుంచి ఓటీటీ ఆడియన్స్ ముందుకు రాబోతుంది. 

Netflix Confirms Kaantha OTT Release Date:

Kaantha OTT release update

Tags:   KAANTHA
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ