డిసెంబర్ 1 సోమవారం ప్రముఖ హీరోయిన్ సమంత దర్శకుడు రాజ్ నిడిమోరు ను కోయంబత్తూర్ లోని ఈషా యోగ ఫౌండేషన్ లో వివాహమాడింది. రాజ్ నిడిమోరు తో డేటింగ్ చేస్తూ వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సమంత ను రాజ్ నిడిమోరు ఫ్యామిలీ కోడలిగా తమ కుటుంబంలోకి సాదరంగా ఆహ్వానించింది.
డిసెంబర్ 2న అంటే నిన్న మంగళవారం సమంతకు అత్త వారింట్లో గ్రాండ్ వెల్కమ్ లభించింది. నిడిమోరు ఫ్యామిలీలోకి సమంతను ఆహ్వానిస్తూ రాజ్ సిస్టర్ శీతల్.. ఎప్పుడూ ఆమెకు అండగా ఉంటానని సోషల్ మీడియా వేదికగా ఆమె సమంత కు మాటిచ్చింది. అంతేకాకుండా ఆనందంతో మాటలు రావడం లేదు. ఒక గొప్ప భక్తుడు ప్రేమనిండిన హృదయంతో శివలింగాన్ని ఆలింగనం చేసుకుంటే ఎంత ఆనందిస్తాడో ఈరోజు నేను అలా ఉన్నాను.
నేడు మా కుటుంబం పరిపూర్ణమైంది. సమంత- రాజ్ ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకుసాగుతుండడం మాకు గర్వంగా ఉంది. ఒకరిపై ఒకరికి గౌరవం, ప్రేమ,నిజాయతీతో రెండు హృదయాలు ఒకే మార్గాన్ని ఎంచుకున్నప్పుడు వారి జీవితం ప్రశాంతతో నిండిపోతుంది. మేము వీరికి ఎల్లప్పుడూ అండగా ఉంటాము అంటూ ఆమె తన వదిన సమంత కు అన్న రాజ్ కు విషెస్ తెలిపారు.




BB9: ఓటింగ్ లో దుమ్మురేపుతున్న కంటెస్టెంట్
Loading..