Advertisementt

లేడీ ఓరియెంటెడ్ అంటే ఆలోచించాల్సిందే

Wed 03rd Dec 2025 12:42 PM
keerthy suresh  లేడీ ఓరియెంటెడ్ అంటే ఆలోచించాల్సిందే
Keerthy Suresh female centric films struggling at the box office లేడీ ఓరియెంటెడ్ అంటే ఆలోచించాల్సిందే
Advertisement
Ads by CJ

చాలామంది హీరోయిన్స్ క్రేజ్ ఉంది కదా అని ఉమెన్ సెంట్రిక్ మూవీస్ ని ఎంచుకుంటారు. అవి కొంతమందికి వర్కౌట్ అయినా చాలామందికి మిస్ ఫైర్ అవుతాయి. గతంలో విజయశాంతి లేడీ ఒరింటెడ్ మూవీ చేస్తే హీరోలతో సమానమైన కలెక్షన్స్ పట్టుకొచ్చేది. అనుష్క అరుంధతి తో ప్రూవ్ చేసుకున్నా భాగమతి తో బోర్లా పడింది. లేడీ సూపర్ స్టార్ నయనతార ఉమెన్ సెంట్రిక్ మూవీస్ చేసినా ఆమె క్రేజ్ కి అవి చాలావరకు హిట్ అయ్యాయి.

కొద్దికొద్దిగా క్రేజ్ ఉన్న హీరోయిన్స్ ఇలాంటి కథలను ఎంచుకుంటే ఎవరో ఒకరు సక్సెస్ అవుతున్నారు తప్ప అందరికి అదృష్టం కలిసి రావడం రాదు. రీసెంట్ గా రష్మిక మందన్న గర్ల్ ఫ్రెండ్ కి ఆ మాత్రం కలెక్షన్స్ వచ్చాయంటే.. ఆమె పాన్ ఇండియా స్టేటస్, ఆమెకు మంచి క్రేజ్ ఉంది కాబట్టే. మరి కీర్తి సురేష్ కి అంత క్రేజ్ ఉందా. అంటే ఉంది.

మహానటి తర్వాత ఆమె పాపులారిటీ పెరిగింది కానీ దానితో పాటుగా ఆమె సక్సెస్ రేట్ పెరగలేదు. వరస సినిమాలు చేస్తుంది. అందులో హిట్ అయినవి చాలా తక్కువ. దసరా లాంటి హిట్స్ పడ్డాయి. ఇక కీర్తి సురేష్ పెంగ్విన్, మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి, రఘు తాత లాంటి ఉమెన్ సెంట్రిక్ మూవీస్ చేసింది. అందులో ఎన్ని హిట్ అయ్యాయో అనేది అది అందరికి తెలుసు.

మరి ఇప్పుడు కీర్తి సురేష్ ఏ ధైర్యం తో రివాల్వర్ రీటా చేసిందో ఆమెకే తెలియాలి. ఇది మనమంటున్నమాట కాదు ఆమె అభిమానులే అంటున్నారు. అదే సినిమా హిట్ అయితే ఆహా ఓహో అనేవారు. కానీ రివాల్వర్ రీటా మిస్ ఫైర్ అయ్యింది. అందుకే కీర్తి సురేష్ ని నెటిజెన్లు కూడా ఆడుకుంటున్నారు. స్టార్ హీరోల సినిమాలకు డివైడ్ టాక్ వస్తే రెండోరోజుకు పరిస్థితి మారిపోతుంది. ఇక్కడ కీర్తి సురేష్ సినిమాకి మొదటి రోజు ఓపెనింగ్స్ లేవు.

అంతెందుకు రివాల్వర్ రీటా విడుదలైన కొన్ని థియేటర్స్ లో ఆడియన్స్ లేక షోస్ క్యాన్సిల్ అయ్యాయి అంటే.. కీర్తి సురేష్ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇకపై ఇలాంటి స్క్రిప్ట్స్ కి దూరంగా ఉండాలని. చూద్దాం ఆమె ఇకపై ఎలాంటి  తీసుకుంటుందో అనేది. 

Keerthy Suresh female centric films struggling at the box office:

Keerthy Suresh Failed To carry Female Centric Roles

Tags:   KEERTHY SURESH
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ