బిగ్ బాస్ సీజన్ 9 ఇంకా కేవలం మూడు వారాలు మాత్రమే మిగిలి ఉంది. వారం వారం ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతూ వెళ్లిపోయారు. కామనర్స్ vs సెలెబ్రిటీస్ లో ప్రస్తుతం హౌస్ లో ఇద్దరు కామనర్స్, మిగిలిన ఆరుగురు సెలబ్రిటీస్ ఉన్నారు. భరణి, ఇమ్మానుయేల్, తనూజ, రీతూ, సంజన, సుమన్, డిమోన్ పవన్, కళ్యాణ్ లు ఉండగా ఈ 12 వ వారం దివ్య ఎలిమినేట్ అయ్యింది.
ఇక ఈవారం హౌస్ లో ఉన్న ఎనిమిదిమందిలో కళ్యాణ్ కెప్టెన్ అవడంతో అతన్ని ఎవరూ నామినేట్ చెయ్యలేదు. మిగతా ఏడుగురిలో ఆరుగురు నామినేషన్స్ లోకి వచ్ఛినట్టుగా తెలుస్తుంది. ఇమ్మాన్యుయేల్ రీతూ, డిమోన్ పవన్ ని నామినేట్ చెయ్యగా, భరణి తన వస్తువులు దొంగిలించిన సంజనను నామినేట్ చేసాడు సంజనను రీతూ కూడా నామినేట్ చేసింది.
ఇదే నామినేషన్స్ లో ఇమ్ము-తనూజ మద్యన ఉన్న క్లాష్ ని సాల్వ్ చేసుకున్నారు. ఫ్రెండ్స్ అయిన తనూజ, రీతూ మద్యన కూడా ఈ నామినేషన్స్ లో గొడవ జరిగినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ వారం ఇమ్మాన్యుయేల్, కెప్టెన్ కళ్యాణ్ తప్ప మిగతా తనూజ, భరణి, సుమన్ శెట్టి, సంజన, రీతూ, డిమోన్ పవన్ నామినేషన్స్ లోకి రాగా నేను టికెట్ టు ఫినాలే కొట్టి చూపిస్తా అంటూ డిమోన్ పవన్ ఛాలెంజ్ చేసాడు. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో అనేది చూడాలి.




అఫీషియల్: రాజ్ ని పెళ్లాడిన సమంత 
Loading..