రాజ్ నిడిమోరు తో డేటింగ్ రూమర్స్ ని నిజం చేసి చూపించింది సమంత. నాగ చైతన్య తో విడాకుల తర్వాత ఒంటరిగా ఉంటున్న సమంత ఈ మధ్యలో హెల్త్ రీజన్స్ తో సతమతమై దర్శకుడు రాజ్ నిడిమోరు కి దగ్గరైంది. బాలీవుడ్ దర్శకుడు రాజ్ తో సమంత కొద్దిరోజులుగా డేటింగ్ చేస్తుంది. ఆ విషయమై ఎక్కడా వారిద్దరూ స్పందించలేదు.
అటు రాజ్ నిడిమోరు మాజీ భార్య వీరి బంధం పై నిఘాడమైన పోస్ట్ లతో రచ్చ చేస్తుంది. అలాంటి సమయంలోనే ఈరోజు సోమవారం డిసెంబర్ 1 న సమంత-రాజ్ నిడిమోరు ల వివాహం కోయంబత్తూర్ లోని సద్గురు ఆశ్రమంలో జరుగుతుంది అనే వార్త వైరల్ అయ్యింది. అది నిజమా, కాదా అనే అనుమానంలో అందరూ కొట్టుమిట్టాడుతున్న సమయంలోనే సమంత తన రెండో పెళ్లిని అనౌన్స్
చేసింది. రాజ్ నిడిమోరు తో ఏడడుగులు నడిచి ఉంగరాలు మార్చుకున్నట్టుగా, సాంప్రదాయ పద్దతిలో వివాహం జరిగినట్టుగా ఫొటోస్ షేర్ చేసింది. దానితో సమంత-రాజ్ నిడిమోరు ల బంధం అఫీషియల్ అయ్యింది. ఈరోజు ఉదయం ఈషా ఫౌండేషన్ లో సమంత-రాజ్ నిడిమోరు వివాహం కొద్దిమంది సన్నిహితుల నడుమ వైభవంగా సింపుల్ గా జరిగినట్లుగా తెలుస్తుంది.




రాజా సాబ్ సెకండ్ సింగిల్ అప్పటివరకు లేనట్లే 
Loading..