పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా ఫిలిం పెద్ది చిత్రం మార్చ్ 27 న విడుదలకు సిద్దమవుతుంది. బుచ్చిబాబు పెద్ది షూటింగ్ ని చాలా ఫాస్ట్ గా ఫినిష్ చేస్తున్నాడు. ప్రస్తుతం అల్యూమినియం ఫ్యాక్టరీలో రామ్ చరణ్-శివరాజ్ కుమార్ లపై భారీ యాక్షన్ సీక్వెన్స్ ని బాలీవుడ్ ఫైట్ మాస్టర్ షామ్ కౌశల్ నేతృత్వంలో తెరకెక్కిస్తున్నారు.
క్రేజీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న పెద్ది చిత్రానికి సంబందించిన ఓటీటీ డీల్ క్లోజ్ అయినట్లుగా తెలుస్తుంది. పెద్ది ఓటీటీ హక్కుల కోసం ప్రముఖ ఓటీటీ సంస్థలు పోటీపడగా.. భారీ ధరకు టాప్ 1 ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ పెద్ది డిజిటల్ హక్కులు సొంతం చేసుకున్నట్టుగా సమాచారం.
అన్ని భాషలకు కలిపి నెట్ ఫ్లిక్స్ పెద్ది చిత్రానికి కళ్ళు చెదిరే డీల్ అంటే దాదాపుగా రూ.130 కోట్లతో డీల్ క్లోజ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే పెద్ది చికిరి సాంగ్ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది. అటు ఫస్ట్ గ్లింప్స్ ఇటు సాంగ్ అన్ని పెద్ది పై విపరీతమైన అంచనాలు పెంచేసాయి. అందుకే నెట్ ఫ్లిక్స్ ఆలోచించుకోకుండా ఇంత భారీ డీల్ సెట్ చేసింది అంటున్నారు.




సూపర్‌స్టార్ 325 కోట్ల డీల్
Loading..