మలయాళ చిత్రాలు ఈ ఏడాది ఎంతగా సక్సెస్ అవుతున్నాయో అనేది తరచూ వింటూనే ఉన్నాము. ప్రతి నెల ఏదో ఒక హిట్టు మలయాళ ఇండస్ట్రీ నమోదు చేస్తుంది. గత నెలలో ఎలాంటి హడావిడి లేకుండా మోహన్ లాల్ కొడుకు ప్రణవ్ మోహన్ లాల్ నటించిన డీయస్ ఈరే మలయాళ థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.
ఈ చిత్రానికి మలయాళంలో సూపర్ హిట్ రేటింగ్స్ రావడమే కాదు, అది విడుదలైన మిగతా భాషల్లోనూ సూపర్ హిట్ రేటింగ్స్ ఇచ్చారు. థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ అయిన ఈ హారర్ థ్రిల్లర్ చిత్రం డీయస్ ఈరే ఎప్పుడెప్పుడు ఓటీటీ లో స్ట్రీమింగ్ లోకి వస్తుందో అని ఫ్యామిలీ ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు.
డీయస్ ఈరే ఓటీటీ హక్కులను దక్కించుకున్న జియో హాట్ స్టార్ ఇప్పుడు ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ లోకి తేబోతుంది. జియో హాట్ స్టార్ వారు డిసెంబర్ 5 డేట్ అనౌన్స్ చేశారు. కేవలం మలయాళ భాషకే ఓటెటీ డేట్ లాక్ చేసిన జియో హార్ స్టార్ మిగతా లాంగ్వేజెస్ ని హోల్డ్ లో పెట్టింది. కానీ తాజాగా మిగతా భాషల్లోనూ ఈ చిత్రం డిసెంబర్ 5 నుంచే స్ట్రీమింగ్ కానున్నట్లుగా ప్రకటించారు.




రష్మిక గర్ల్ ఫ్రెండ్ ఓటీటీ డేట్ లాక్ 
Loading..