Advertisementt

ఆ ముగ్గురు మాల్దీవుల‌కు ఎస్కేప్

Sun 30th Nov 2025 10:02 AM
manchu lakshmi  ఆ ముగ్గురు మాల్దీవుల‌కు ఎస్కేప్
Manchu Lakshmi and Rakul Take Maldives Break ఆ ముగ్గురు మాల్దీవుల‌కు ఎస్కేప్
Advertisement
Ads by CJ

స్నేహం అంటే ఇలా ఉండాలి...! ఏదో ముఖ స్తుతి కోసం .. డ‌బ్బు అవ‌స‌రం కోసం దోస్తీ క‌ట్ట‌కూడ‌దు. స్నేహం అంటే దేనికైనా సిద్ధంగా ఉండాలి. ఒక‌రి సాయానికి, ఒక‌రి క‌ష్టాన్ని షేర్ చేసుకోవ‌డానికి లేదా ఆనందాన్ని పంచుకోవ‌డానికి స్నేహితులు ఉండాలి. అయితే ఈ అన్ని ర‌కాల ల‌క్ష‌ణాలు ఈ ముగ్గురు స్నేహితురాళ్ల‌కు ఉన్నాయి.  మంచు ల‌క్ష్మీ ప్ర‌స‌న్న‌- ర‌కుల్ ప్రీత్ సింగ్- ప్ర‌గ్య జైశ్వాల్... కొన్నేళ్లుగా ఆ ముగ్గురూ ఎంత గ్రేట్ ఫ్రెండ్స్ అనేది ఎవ‌రికీ చెప్పాల్సిన ప‌ని లేదు.

ఏదైనా వెకేష‌న్ కి వెళ్లాల‌న్నా, జిమ్ యోగా సెష‌న్స్ కి వెళ్లాల‌న్నా, పార్టీలు ఫంక్ష‌న్ల‌కు ఎటెండ‌వ్వాల‌న్నా ఆ ముగ్గురూ క‌ల‌వ‌నిదే ఏదీ ముందుకు సాగ‌దు. అంత‌టి స్నేహం వారి మ‌ధ్య ఉంది. ఇప్పుడు వీరంతా త‌మ కుటుంబాల‌తో క‌లిసి మాల్దీవుల్లో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు. అక్క‌డ సీ- టెర్నిన‌ల్ వ‌ద్ద ఇచ్చిన ఫోజును బ‌ట్టి ల‌క్ష్మీ మంచు త‌న పిల్ల‌లు విద్యా నిర్వాణ‌, ఆనంద్ ల‌తో క‌లిసి వెకేష‌న్ లో చేరింది.

ర‌కుల్ ప్రీత్ త‌న భ‌ర్త జాకీ భ‌గ్నానీతో క‌లిసి అక్క‌డ సెల‌బ్రేష‌న్ కి జాయిన్ కాగా, ప్ర‌గ్య జైశ్వాల్ త‌న కుటుంబీకుల‌తో క‌లిసి స్నేహితుల‌తో క‌లిసిపోయింది. మొత్తానికి స్నేహం ఒక ఉత్స‌వంగా మారింది! ఈ స్పెష‌ల్ ఫోటోగ్రాఫ్ ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారుతోంది. ఇటీవ‌ల దేదే ప్యార్ దే 2 బాక్సాఫీస్ స‌క్సెస్ ని ఆస్వాధిస్తున్న ర‌కుల్, ఇంత‌లోనే త‌న స్నేహితుల‌తో క‌లిసి క‌నిపించింది. బ‌హుశా త‌న సినిమా స‌క్సెసైన సంద‌ర్భంగా ర‌కుల్ త‌న ఫ్రెండ్స్ కి పార్టీ ఇచ్చిందా? అన్న‌ది చూడాలి.

 

 

Manchu Lakshmi and Rakul Take Maldives Break:

Manchu Lakshmi in Maldives with friends and family

Tags:   MANCHU LAKSHMI
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ