బిగ్ బాస్ సీజన్ 9 లో 12 వారం ముగిసిపోయింది. ఈ వారం మొత్తం నామినేషన్స్ హీట్ సోమవారం నుంచి స్టిల్ శనివారం ఎపిసోడ్ వరకు నడిచింది. తనని నామినేట్ చేసిన రీతూ చౌదరిని సంజన పర్సనల్ గా టార్గెట్ చెయ్యడం హౌస్ మొత్తానికి నచ్చలేదు, ఆఖరికి హోస్ట్ నాగార్జున కూడా సంజన పై ఫైర్ అయ్యారు.
ఇక ఈ వారం నామినేషన్ లో ఉన్న ఎనిమిదిమందిలో ఎవరు ఈ వారం ఎలిమినేట్ అవుతారో అనే విషయంలో ఆడియన్స్ లో చాలావరకు క్లారిటీ ఉంది. గత వారం డేంజర్ జోన్, బోటమ్ 2 లో ఉన్న దివ్య నిఖిత ఈ వారం ఎలిమినేట్ అయ్యింది. సుమన్ శెట్టి, భరణి, సంజన, దివ్య నిఖిత డేంజర్ జోన్ లో ఉండగా.. ముందుగా దివ్య ఎలిమినేట్ అయ్యినట్లుగా బిగ్ బాస్ లీకులు చెబుతున్నాయి.
అయితే ఈ వారం కేవలం సింగిల్ ఎలిమినేషన్ కాదు.. డబుల్ షాక్ ఇవ్వబోతున్నారు. ఈ వారం హౌస్ లో సంజన ప్రవర్తన, ఆమె తీరు నచ్చక, అటు ఓటింగ్ లోను లీస్ట్ లో ఉన్న సంజనను ఆదివారం ఎపిసోడ్ లో ఎలిమినేట్ చేసినట్టుగా తెలుస్తుంది. మరోపక్క సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యాడనే టాక్ కూడా వినబడుతుంది. సో ఈ వారం పక్కాగా డబుల్ ఎలిమినేషన్ జరిగినట్లుగా లీకులు సోషల్ మీడియాలో తాండవం చేస్తున్నాయి.




వెండి ధర రూ.5 లక్షలు పలుకుతుందా
Loading..