కీర్తి సురేష్ నిన్న శుక్రవారం నవంబర్ 28 న రివాల్వర్ రీటా అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం విడుదలైంది. ఈ చిత్రంలో కీర్తి సురేష్ మెయిన్ లీడ్ లో కనిపించడమే కాదు ఈ చిత్రం కోసం కీర్తి సురేష్ రివాల్వర్ రీటా ప్రమోషన్స్ లో చాలా కష్టపడింది.
మరి నిన్న విడుదలైన రివాల్వర్ రీతూ ఎలా ఉందొ ఆడియన్స్ మాత్రమే కాదు క్రిటిక్స్ కూడా తమ తమ రివ్యూస్ తో రెస్పాన్స్ ఇచ్చేసారు. కీర్తి సురేష్ యాక్టింగ్ సూపర్ అయినా రొటీన్ స్టోరీ, స్లో నేరేషన్ ఇవన్నీ సినిమాని కిల్ చేసాయి. కొన్ని కామెడీ సీన్స్ బావున్నా సినిమా ఓవరాల్ గా బోర్ అనేస్తున్నారు.
మరి రివాల్వర్ రీటా తో కీర్తి సురేష్ సోలో గా కొడదామని చాలా హోప్స్ పెట్టుకుంది. కానీ రివాల్వర్ రీటా చిత్రానికి వస్తున్న రెస్పాన్స్ చూసి కీర్తి సురేష్ బాగా డిజప్పాయింట్ అయ్యింది అనే చెప్పాలి. అటు క్రిటిక్స్ కూడా రివాల్వర్ రీటా కు పూర్ రేటింగ్ ఇవ్వడం చూస్తే ఈ చిత్రం ఎలా ఉందొ స్పష్టమవుతుంది.




శివరాజ్ కుమార్ తో చరణ్ ఫైట్ 
Loading..