బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ పెద్ది షూటింగ్ ఫుల్ స్వింగ్ లో నడుస్తుంది. మార్చి 27 టార్గెట్ గా తెరకెక్కుతున్న పెద్ది చిత్రంలోని చికిరి చికిరి ప్రస్తుతం 100 మిలియన్ వ్యూస్ తో యూట్యూబ్ ని షేక్ చేస్తుంది. ప్రస్తుతం రామ్ చరణ్ పై బుచ్చిబాబు యాక్షన్ సీక్వెన్స్ ని చిత్రికరిస్తున్నారు.
పెద్ది చిత్రంలో కన్నడ యాక్టర్ శివ రాజ్ కుమార్ విలన్ గా కనిపించనున్నారనే విషయం తెలిసిందే. ప్రెజెంట్ హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన ఓ భారీ సెట్ లో రామ్ చరణ్ ఇంకా శివరాజ్ కుమార్ ల పై దర్శకుడు బుచ్చిబాబు భారీ ఫైట్ చిత్రీకరణ చేపట్టారు.
ఈ క్రేజీ భారీ యాక్షన్ సీక్వెన్స్ కి దంగల్ మూవీ ఫైట్ మాస్టర్ డిజైన్ చేస్తున్నారు అని తెలుస్తుంది. ఇక ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా జగపతి బాబు కీ రోల్ ప్లే చేస్తున్నారు.




మిల్కి బ్యూటీ డైట్ సీక్రెట్ 
Loading..