పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతము సోల్జర్ గా హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ తో పాటుగా సందీప్ వంగ దర్శకత్వంలో మోస్ట్ అవైటెడ్ స్పిరిట్ చిత్రాన్ని మొదలు పెట్టారు. స్పిరిట్ చిత్రం ఓపెనింగ్ లో ప్రభాస్ కనిపించలేదు. కొద్దిరోజులుగా ప్రభాస్ స్పిరిట్ లో తన పోలీస్ లుక్ కోసం స్పెషల్ గా మేకోవర్ అవడమే కాదు అంతే సీక్రెట్ గా లుక్ టెస్ట్ కూడా జరిగింది.
అయితే ప్రభాస్ స్పిరిట్ ఓపెనింగ్ రోజు కనిపించకపోవడానికి కారణం సందీప్ రెడ్డి వంగా ప్రభాస్ లుక్ ని రివీల్ చెయ్యాలని అనుకోవడం లేదు. అందుకే ప్రభాస్ ని జస్ట్ హ్యాండ్ చూపించి అయన ఫేస్ దాచేసారు అంటే.. ఎన్నాళ్ళు ప్రభాస్ లుక్ ని దాస్తారో చూద్దామని చాలామంది మట్లాడారు.
కానీ కొంతమంది ప్రభాస్ లుక్ ని దాయడం పెద్ద కష్టమేమి కాదు అంటున్నారు. ప్రభాస్ పెద్దగా మీడియా ముందుకు రారు, ఆయన సినిమా ప్రమోషన్స్ లోను మెరుపు తీగలా ఓ ఈవెంట్ లో దర్శనమిస్తారు తప్ప అయన పబ్లిక్ లో తిరిగి చాలా రోజులైంది. ఆయన స్వతహాగా చాలా మొహమాటస్తుడు, అలాగే బాహుబలి తర్వాత వెయిట్ పెరగడం ఇవన్నీ ప్రభాస్ ని ఎక్కువగా మీడియా ముందుకు రాకుండా చేస్తున్నాయి.
ప్రభాస్ ఎయిర్ పోర్ట్ లుక్స్ కూడా చాలా అరుదుగా బయటికి వస్తాయి. సో సందీప్ వంగ కు ప్రభాస్ లుక్ దాయడం కష్టమేమి కాదులే అంటూ సెటైర్స్ వేస్తున్నారు. మరి జనవరి 9 న విడుదల కాబోయే రాజా సాబ్ ప్రమోషన్స్ లో ఏమైనా ప్రభాస్ కనిపిస్తారమేమో చూడాలి.




అలాంటి రోగం లేదన్న ట్యాలెంటెడ్ నటి
Loading..