చాలామంది ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ లేనిదే జీవించలేని పరిస్థితి. 24/7 స్మార్ట్ ఫోన్ లోనే కాలక్షేపం చేయడం చూస్తున్నాం. కొందరు సెల్ ఫోన్ చూస్తూ డ్రైవింగ్ చేస్తుంటారు. బైక్ పై వెళుతూ మెడ వాల్చి డ్రైవింగ్ చేసే బాపతు ఉన్నారు. అయితే వీళ్లంతా ఒకేసారి రెండు టాస్కులు లేదా మల్టీటాస్కింగ్ చేసే బాపతు. రెండు టాస్కులు లేదా అంతకుమించి తలకెత్తుకుంటే అది అన్నివిధాలా మనిషికి ముప్పు. మానసికంగా అదో రకం సమస్య.
అయితే కాంతార 2 ఫేం రుక్మిణి వసంత్ చెప్పిన ఈ పాయింట్ అందరికీ ఉపయుక్తమైనది. తాను వేరే ఏదైనా పని చేస్తూ ఫోన్ లు చూడనని చెప్పింది. ఒకవేళ ఫోన్ చూస్తే, ఇతర పనుల జోలికి వెళ్లదట. ఒకేసారి మల్టీటాస్కింగ్ చేయనని స్పష్ఠంగా చెప్పింది. నిజమే ఈరోజుల్లో మల్టీటాస్కింగ్ చేయడం, దాని వల్ల రుగ్మతలను ఎదుర్కోవడం సహజంగా మారింది. చాలా మందికి మతిమరుపు- అల్జీమర్స్ కూడా తలెత్తే పరిస్థితి.
ఇక రుక్మిణికి ఉన్న మంచి లక్షణాలలో చిన్నప్పటి నుంచి కథల పుస్తకాలు చదివే అలవాటు ఉంది. అమరచిత్రకథ, బొమ్మరిల్లు, బుజ్జాయి పుస్తకాలు చదివే అలవాటు ఉందని తెలిపింది. అలాగే కొన్నిటిని వదిలించుకునేందుకు డ్రాయింగ్ - స్కెచ్ లు గీసే అలవాటు ఉందని కూడా తాజా ఇంటర్వ్యూలో చెప్పింది. `కాంతార` తర్వాత బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియన్ సినిమాలలో నటించే అవకాశం అందుకున్న రుక్మిణి వసంత్ తదుపరి యష్ టాక్సిక్ తో మరో పాన్ ఇండియా హిట్ అందుకోవాలని కలలు కంటోంది. ఆ తర్వాత ఎన్టీఆర్- నీల్ చిత్రం కూడా రుక్మిణికి బిగ్ పాథ్ బ్రేకింగ్ మూవీ కానుంది. ఇక రుక్మిణి నటించిన కింగ్ డమ్, మదరాసి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా మారిన సంగతి తెలిసిందే. అయితే ఈ డిజాస్టర్ల ప్రభావం అమ్మడిపై అస్సలు పడలేదు.




అఖండ 2 సెన్సార్ రివ్యూ 
Loading..