బిగ్ బాస్ లో ఏం జరుగుతుందో ముందే అక్కడి టెక్నీకల్ టీమ్ ద్వారా తెలుసుకుని బిగ్ బాస్ అప్ డేట్స్ అంటూ బిగ్ బాస్ రివ్యూస్ చెప్పేవారు ఎపిసోడ్స్ కన్నా ముందే వాటిని చెప్పేస్తున్నారు. మరోపక్క 24/7 వల్ల కూడా బిగ్ బాస్ కి మైనస్ అయ్యింది. నైట్ ఎపిసోడ్ వచ్చేసరికే అందులో ఏం జరుగుతుందో సోషల్ మీడియాలో వచ్చేస్తుంది.
శనివారం ఎపిసోడ్ కన్నా ముందే ఆదివారం ఎవరు ఎలిమినేట్ అవుతున్నారో లీకులు బయటికి వచ్చేస్తున్నాయి. అలాంటప్పుడు వీకెండ్ ఎపిసోడ్స్ పై ఎవరికీ ఆసక్తి ఉంటుంది. అయితే ఈ సీజన్ లో రెండుసార్లు బిగ్ బాస్ యాజమాన్యం ఈ లీకుల రాయుళ్లను బురిడీ కొట్టించింది. ముఖ్యంగా గత వారం దివ్య ఎలిమినేట్ అయ్యింది అని బిగ్ బాస్ రివ్యూస్ చెప్పేవాళ్ళు బయటపెట్టేసారు. ఆహా ఓహో అనుకున్న కొన్ని గంటలకే దివ్య ఎలిమినేట్ అవ్వలేదు, ఈసారి ఎలిమినేషన్ ఎత్తేశారని చెప్పారు. అదే సండే ఎపిసోడ్ లో కనిపించింది. దానితో రివ్యూ రాయుళ్లు, లీకుల్ రాయుళ్లు కు దిమ్మతిరిగింది.
ఇప్పడు కూడా ఈ వారం కెప్టెన్ ఎవరు అవుతారో అనే ఉత్కంఠ పోరులో ఫైనల్ టాస్క్ లో పోటీపడిన డిమోన్ పవన్, కళ్యాణ్ పడాలలో ఎవరు కెప్టెన్ అయ్యారో అంటే డిమోన్ పవన్ లాస్ట్ కెప్టెన్ గా నిలిచి బిగ్ బాస్ సీజన్ 9 లో మూడు సార్లు కెప్టెన్ అయ్యాడని పొగిడేశారు. కానీ తర్వాత ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో పోరాడి గెలిచి సీజన్ 9 కి చివరి కెప్టెన్ గా కళ్యాణ్ పడాల నిలిచాడు.
వారు ఎంతగా పోటీ పడ్డారో గత రాత్రి ఎపిసోడ్ లో చూపించారు. ఆ ఎపిసోడ్ చాలా ఎమోషనల్ గా జనాలకు కనెక్ట్ అయ్యింది. ఈ లీకులు అవి మిస్ ఫైర్ అవడం చూసే బిగ్ బాస్ యాజమాన్యం ఇచ్చిన ట్విస్ట్ కి లీకుల రాయుళ్లకు దిమ్మతిరిగి బొమ్మ కనబడింది.




అఖండ 2 - బాలయ్య సింహగర్జన 
Loading..