భారత్ ని కొట్టాలంటే అక్కడ మూలాలను(కుంభమేళా, పురాణాలు) అడ్డం పెట్టుకునే కొట్టాలి అని విలన్ వాయిస్ వినిపించగానే బాలయ్య సింహ గర్జ అఖండ 2 తాండవం టీజర్ కె హైలెట్. ఈ మాసివ్ టీజర్ కట్ లో బోయపాటి చూపించారు. అఖండ 2 తాండవం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విడుదల చేసిన అఖండ 2 మాసివ్ టీజర్ లో బాలయ్య అఘోర కేరెక్టర్ లో సింహగర్జన చేసారు.
అఘోర గెటప్ లో బాలయ్య చెప్పిన ఇంగ్లీష్ డైలాగ్ కి ఫ్యాన్స్ కి పూనకాలు రావాల్సిందే. అది పినిశెట్టి విలన్ లుక్, ఆయన విన్యాసాలు, బాలయ్య చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్స్ అన్ని ఈ మాసివ్ టీజర్ లో హైలెట్. ఇక థమన్ BGM మళ్లీ మళ్లీ వినాలనిపించేంతగా అఖండ 2 లో వినిపిస్తుంది.
బోయపాటి మేకింగ్, ప్రతి సీన్ ని చాలా రిచ్ గా చూపించే ప్రొడక్షన్ వాల్యూస్, సినిమాటోగ్రఫీ, ముఖ్యంగా బాలయ్య చేతిలో త్రిశూలం అయితే ఇదివరకెన్నడూ చూడని ఆయుధంగా అభిమానులు మాట్లాడుకుంటున్నారు. అఖండ 2 ట్రైలర్ కి మించి ఈ మాసివ్ టీజర్ ఉంది అంటూ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.




టికెట్ ధరలు పైరసీకి కారణం కాదు
Loading..