గోవా వెళ్లారు అక్కడ బీచ్ లో కనిపించారు అంటే ఏ బికినీ లోనో.. లేదంటే మినీ స్కర్ట్స్, లేదు అంటే ఫ్రాక్స్ లో కనిపిస్తారు తప్ప లంగా వోణి లోనో లేదంటే చీర కట్టు లోనో ఎవ్వరు కనిపించరు. బీచ్ అంటే హుషారుగా బికినీ లతో ఎంజాయ్ చేసే స్పాట్. అలాంటి స్పాట్ లో చీర కట్టుకుని కనిపిస్తే విచిత్రంగా కాక ఇంకేముంటుంది.
బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రీలీల గోవా బీచ్ లో చీరకట్టులో మెస్మరైజ్ చేసింది. గ్రీన్ శారీ లో స్లీవ్ లెస్ బ్లౌజ్, లూజ్ హెయిర్ తో మత్తెక్కించే చూపులతో శ్రీలీల సూపర్బ్ అనిపించినా బీచ్ లో చీర కట్టుకుని ఎంజాయ్ చెయ్యడమేమిటి శ్రీలీల అంటూ నెటిజెన్స్ కామెంట్లు పెడుతున్నారు.
అయితే శ్రీలీల గోవా బీచ్ లో ఎంజాయ్ చెయ్యడం లేదు, ఆమె ఓ సినిమా షూటింగ్ విషయమై అక్కడ ఉంది, అందుకే చీరకట్టుకుని సన్ రైజ్ ని ఎంజాయ్ చేస్తుంది అంటూ ఆమె అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.




TTD శివజ్యోతి ఆధార్ బ్లాక్-అసలు నిజమిదే 
Loading..