యాంకర్ శివజ్యోతి తిరుమల శ్రీవారి ప్రసాదం పై చేసిన ఓ రీల్ ఆమెను ఇబ్బందుల్లోకి నెట్టింది. శ్రీవారి ప్రసాదం తీసుకుంటూ శివజ్యోతి ఆమె తమ్ముడు తిరుమలలో కాస్ట్లీ బిచ్చగాళ్లమంటూ చేసిన వ్యాఖ్యలపై శ్రీవారి భక్తులు, హిందూ సంఘాలు మండిపడ్డాయి. యాంకర్ శివజ్యోతి పై సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా వచ్చాయి.
దానితో శివజ్యోతి క్షమాపణ చెబుతూ తను అలా అని ఉండకూడదు అంటూ వీడియో తో శ్రీవారి భక్తులకు, హిందూ సంఘాలకు సారీ చెప్పింది. అది జరిగిన రెండు రోజులకు శివజ్యోతి పై టీటీడీ కఠిన చర్యలకు సిద్ధమైంది. ఆమె ఇకపై శ్రీవారిని దర్శించుకోకుండా బిగ్ షాక్ ఇచ్చింది. శివజ్యోతి ఆధార్ కార్డు బ్లాక్ చేసారు అంటూ వార్తలు కనిపించాయి.
అయితే శివజ్యోతి ఆధార్ కార్డు ని టీటీడీ బ్లాక్ చేసింది, ఆమెను ఇకపై శ్రీవారిని దర్శించుకోకుండా పనిష్ చేసింది అనే వార్తలు ఫేక్. శివజ్యోతి పై టీటీడీ ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు, ఆమె ఆధార్ కార్డు బ్లాక్ చెయ్యలేదు. అవన్నీ ఫేక్ న్యూస్ లే అని తెలుస్తుంది. అసలు శివజ్యోతి విషయంలో టీటీడీ ఎలాంటి చర్యలు చేపట్టలేదు ఇదే నిజం.




ఫైనల్లీ కొట్టింది హిట్టు 
Loading..