పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో కల్ట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తో స్పిరిట్ మూవీ మూవీ పెట్టేస్తున్నారు. ఈ ఆదివారమే స్పిరిట్ మూవీ పూజా కార్యక్రమంలో మొదలయ్యింది. ప్రభాస్ ఈ ఓపెనింగ్ లో కనిపించలేదు కానీ.. ఫ్యాన్స్ మాత్రం స్పిరిట్ పట్టాలెక్కడంపై ఫుల్ గా ఉన్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా త్రిప్తి డుమ్రి హీరోయిన్ గా నటిస్తుంది. స్పిరిట్ ఓపెనింగ్ లోను ఆమె కనిపించింది.
స్పిరిట్ చిత్రంలో కొరియన్ యాక్టర్ డాన్ లీ ప్రభాస్ కి విలన్ గా నటించబోతున్నారు అనే న్యూస్ పై సందీప్ వంగ కూడా ఇండైరెక్ట్ క్లారిటీ ఇచ్చారు. దానితో చాలామంది ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ చాలా ఎగ్జైట్ అయ్యారు. ప్రభాస్ తో కొరియన్ టాప్ స్టార్ పోటీపడడం అంటే స్పిరిట్ పై విపరీతమైన క్రేజ్ వస్తుంది అనుకున్నారు.
అయితే ఈ చిత్రంలో వివేక్ ఒబెరాయ్, ప్రకాష్ రాజ్, నటి కాంచన కీ రోల్స్ ప్లే చెయ్యబోతున్నారు అని సందీప్ వంగ ఓపెనింగ్ రోజు అనౌన్స్ చేసారు. కానీ ఎక్కడా డాన్ లీ స్పిరిట్ లో నటిస్తున్నారు అనే క్లారిటీ ఇవ్వలేదు. అది చూసి ఫ్యాన్స్ డిజప్పాయింట్ అయినా అందరూ స్పిరిట్ విలన్ పై ఇంకా సస్పెన్స్ కంటిన్యూ చేస్తున్నారు అంటూ మాట్లాడుకుంటున్నారు.




BB9: హౌస్ మొత్తం టార్గెట్ తనూజ
Loading..