బిగ్ బాస్ హౌస్ లో టాప్ 5 కంటెస్టెంట్ గా ఫిక్స్ అయిన తనూజ ను ప్రస్తుతం హౌస్ లో ఉన్న వారంతా టార్గెట్ చేస్తున్నారు. భరణి, ఇమ్మానుయేల్, సంజన, సుమన్ శెట్టి, దివ్య వీళ్లంతా తనూజ ను టార్గెట్ చేస్తూ నామినేట్ చేసారు. గతంలోనూ తనూజాను ఏదో విధంగా వీరంతా నామినేషన్స్ లోకి తెచ్చినవారే. అందులోను తనూజ గ్రాఫ్ పై ఇమ్మాన్యుయెల్ కి భయం పట్టుకుంది. దివ్య తనూజ బండారం బయటపెట్టడానికే హౌస్ లోకి వచ్చా అంది.
సో అలా అందరు ముఖ్యంగా వైల్డ్ కార్డులు ఎంటర్ అయ్యిందే తనూజా ను బయటకు పంపించేందుకు వచ్చారు. రమ్య, అయేషా, మాధురి, నిఖిల్, గౌరవ్ అందరూ మిషన్ తనూజా అన్నట్టుగా హౌస్ లోకి ప్రవేశించారు. కానీ తనూజా ను ఏమి చెయ్యలేక వాళ్లే ఎలిమినేట్ అయ్యి హౌస్ ని వీడారు.
ఈ వారం అంటే 12 వారం నామినేషన్స్ లో భాగంగా బిగ్ బాస్ పెట్టిన సీక్రెట్ నామినేషన్ లో భరణి తనూజా ను నామినేట్ చెయ్యగా.. బిగ్ బాస్ ఇచ్చిన రెండో ఛాన్స్ ఓపెన్ నామినేషన్స్ లో ఇమ్మాన్యుయేల్, సుమన్ శెట్టి, సంజన ఇలా అందరూ తనుజనే టార్గెట్ చేసారు. తనూజ వల్లే కెప్టెన్సీ పోయింది అని సుమన్ శెట్టి, తనూజ నన్ను కెప్టెన్సీ త్యాగం చేసావు అన్నావు అని..
నువ్వు దివ్య తో పోరాడవ్, నాతో డిపెండ్ చేసుకున్నావ్ కానీ భరణి, సుమన్ శెట్టి నిన్ను కెప్టెన్సీ నుంచి తప్పించినా వారితో నువ్వు గొడవపెట్టుకోలేదు అంటూ ఇమ్మాన్యుయేల్ తనూజాను టార్గెట్ చేసాడు. ఈ నామినేషన్స్ లో డిమోన్ పవన్.. కళ్యాణ్ ను, కళ్యాణ్.. డిమోన్ పవన్ ను నామినేట్ చెయ్యడం, భరణిని దివ్య, దివ్య భరణిని నామినేట్ చెయ్యడంతో ఒక్క రీతూ తప్ప ఈ వారం హౌస్ మేట్స్ ఎనిమిదిమంది నామినేషన్స్ లోకి వచ్చారు.




ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మారుతి క్షమాపణలు
Loading..