అక్కినేని యువ హీరో నాగ చైతన్య బర్త్ డే ఈరోజు(నవంబర్ 23). నాగ చైతన్య కు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ ని తెలియజేస్తున్నారు. అదే విధంగా నాగ చైతన్య నటిస్తున్న మూవీ అప్ డేట్స్ తో మేకర్స్ ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తున్నారు.
తండేల్ లాంటి బిగ్ హిట్ తర్వాత నాగ చైతన్య విరూపాక్ష దర్శకుడు కార్తీక్ దండు డైరెక్షన్ లో NC 24 స్టార్ట్ చేసారు. భారీ బడ్జెట్ తో క్రేజీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబందించిన ఫస్ట్ లుక్ టైటిల్ ని సూపర్ స్టార్ మహేష్ చేతుల మీదుగా నాగ చైతన్య బర్త్ డే రోజునే రిలీజ్ చేయించారు మేకర్స్.
NC 24 టైటిల్ గా వృషకర్మ అంటూ పవర్ టైటిల్ పెట్టడమే కాదు.. అందులోని నాగ చైతన్య లుక్ కూడా అంతే పవర్ ఫుల్ గా ఉంది. చేతులో పలుగుపట్టుకుని నాగ చైతన్య కోపంతో పవర్ ఫుల్ గా కనిపించారు. వృషకర్మ అంటూ డిఫరెంట్ టైటిల్ తోనే కాదు అందుకు తగ్గ లుక్ తో అభిమానులకు నాగ చైతన్య బర్త్ డే ట్రీట్ ఇచ్చారు.




iBomma క్లోజ్ - కానీ షాకిస్తున్న మూవీ రూల్స్
Loading..