iబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి ని అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. ఇమ్మడి రవి అరెస్ట్ అయిన వెంటనే అతని చేతే iబొమ్మ వెబ్ సైట్ ని క్లోజ్ చేయించడంతో ఇకపై పైరసీ జరగదని, చాలామంది సినీ ప్రముఖులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఆ వెంటనే iబొమ్మ వన్ దర్శనమిచ్చింది.
ఇప్పుడు మూవీ రూల్స్ ఈ పైరసీని స్టార్ట్ చేసింది. నిన్న శుక్రవారం విడుదలైన సినిమాలను మూవీ రూల్స్ పైరసీ చేసి వెబ్ సైట్ లో పోస్ట్ చెయ్యడం అందరికి షాకిచ్చింది. నేరుగా థియేటర్స్ లోకి కెమెరాలు తీసుకేళ్ళి మరీ మూవీ ని కాపీ చేసి వాటిని వెబ్ సైట్స్ లో అప్ లోడ్ చేస్తున్నారు. iబొమ్మ రవి కస్టడీలో ఉన్న సమయంలోనే ఎలాంటి భయం లేకుండా మూవీ రూల్స్ ఇలా పైరసీ చెయ్యడం అందరికి షాకిచ్చింది.
శుక్రవారం విడుదలైన రాజు వెడ్స్ రాంబాయి, ప్రేమంటే, 12 A రైల్వే కాలనీ ఇవన్నీ మూవీ రూల్స్ పైరసీ వెబ్ సైట్ లో దర్శనమిస్తున్నాయి. దానితో నిర్మాతలు, ఓటీటీ సంస్థలు మళ్ళీ పోలీసులను ఆశ్రయించాయి. మరోపక్క విచారణలో iబొమ్మ రవి నోరు మెదపకపోవడం పోలీసులకు సవాల్ గా మారింది. నిన్న శనివారం స్వయంగా సిపి సజ్జనార్ రవి ని విచారించారు.




ఈ వారం విజేత రాజు గాడే
Loading..