బిగ్ బాస్ సీజన్ 9 11 వారాలు పూర్తి చేసుకుని 12 వ వారంలోకి అడుగుపెట్టేందుకు సిద్దమవుతుంది. ఈ వారం హౌస్ లో ఫ్యామిలీ వీక్ నదించింది. బరువైన ఎమోషన్స్, కంటెస్టెంట్స్ కన్నీళ్లు, కనెక్ట్ అయ్యే బాండింగ్స్, చెవిలో గుసగుసలు, తినిపించుకొవడాలు, సరద సన్నివేశాలతో ఈ వారం బిగ్ బాస్ సీజన్ 9 కి భారీగానే టిఆర్పి వచ్చేలా ఉంది.
ఇక గత వారం డబుల్ ఎలిమినేషన్స్ లో ఊహించని కంటెస్టెంట్ నిఖిల్, ఊహించేసిన గౌరవ్ లు ఎలిమినేట్ అయ్యారు. మరి ఈ వారం నామినేషన్స్ లో ఉన్న కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్, పవన్, భరణి, సంజన, దివ్య లలో ఎవరు ఎలిమినేట్ అవుతారనే విషయంలో అందరిలో మంచి ఆసక్తి కనిపిస్తుంది. ఎప్పటిలాగే కళ్యాణ్ పడాల వోటింగ్ లో టాప్ 1 లో ఉంటె కమెడియన్ ఇమ్మాన్యుయేల్ సెకండ్ పొజిషన్ లో ఉన్నాడు.
మూడో స్థానాన్ని భరణి ఆక్యుపై చేసారు. నాలుగు, ఐదు, ఆరు స్థానాల్లో డిమోన్ పవన్, సంజన, దివ్య ఉన్నారు. దివ్య గత వారమే ఎలిమినేట్ అవ్వాల్సి ఉండగా.. ఆమెను సేవ్ చేసి నిఖిల్ ని ఎలిమినేట్ చేయడంపై బయట పెద్ద చర్చ జరిగింది. ఈ వారం పక్కాగా దివ్య ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే లేకపోలేదు.
రెండు రోజులుగా హౌస్ లో తనూజ కు దివ్య హౌస్ లో పెద్ద వార్ జరుగుతుంది. మరి ఈ గొడవలో దివ్య ఏమైనా సింపతీ క్రియేట్ చేసుకుని సేవ్ అవుతుందేమో చూడాలి. ఎట్టి పరిస్థితుల్లో ఈ వారం దివ్య లేదా సంజన లలో ఒకరు ఎలిమినేట్ అవ్వాల్సిందే. చూద్దాం ఎవరు ఈ వారం హౌస్ ని వీడుతారో అనేది.




ఉప్పీ ఇదేమి భాషాభిమానం
Loading..