కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర కొంత గ్యాప్ తరువాత ఒక తెలుగు సినిమాలో నటించారు. రామ్ పోతినేని (రాపో) నటించిన `ఆంధ్రా కింగ్ తాలూకా` చిత్రంలో అతడు తన రియల్ లైఫ్ పాత్ర(హీరోగా)లో నటించాడు. తన ఫేవరెట్ హీరో కోసం ఎంతదాకా అయినా వెళ్లే యువ అభిమానిగా రామ్ ఈ చిత్రంలో నటించాడు. ఇటీవలే ట్రైలర్ విడుదలైన సంగతి తెలిసిందే.
త్వరలో విడుదలకు రానున్న ఈ సినిమా ప్రచార కార్యక్రమాలలో టీమ్ బిజీగా ఉంది. హైదరాబాద్ లో జరిగిన తాజా ఇంటర్వ్యూలో ఉపేంద్రకు కన్నడ భాషాభిమానంపై ఊహించని చిక్కు ప్రశ్న ఎదురైంది. తెలుగు సినిమాలను అనువాదం లేకుండా కర్నాటకలో రిలీజ్ చేసేప్పుడు పోస్టర్లు లేదా ప్రచార సామాగ్రి కన్నడంలోనే ఉండాలని పట్టుబట్టడం సరైనదేనా? అని ప్రశ్నించగా, దానికి ఉపేంద్ర ఆశ్చర్యకరమైన సమాధానం ఇచ్చారు. ఎవరి భాషపై వారికి అభిమానం ఉంటుంది. వారు అలా కోరడం తప్పు కాదని అన్నారు. ఇరుగు పొరుగు భాషల సినిమాలను కన్నడలో ప్రజలు చూడాలనుకుంటున్నారని, తద్వారా ప్రోత్సాహం లభిస్తుందని కూడా సర్ధి చెప్పబోయారు. అయితే అసలు పాయింట్ ఇది కాదు. ఒక తెలుగు సినిమాని కర్నాటకలో నివశించే తెలుగు వారి కోసం ఎలాంటి కన్నడ అనువాదం లేకుండా స్ట్రెయిట్ తెలుగు సినిమాగా రిలీజ్ చేసేప్పుడు కన్నడ పోస్టర్ వేయడం కరెక్టేనా? అనేదే ప్రశ్న. ఇది అసంబద్ధమైనది కాదా? అని ఉపేంద్రను అడిగారు. కానీ అతడికి ఆ ప్రశ్న సరిగా అర్థం కాలేదు. పుష్ప , పుష్ప 2 చిత్రాలను కన్నడలోకి డబ్బింగ్ చేసి రిలీజ్ చేసినప్పుడు కన్నడ పోస్టర్లు వేసారు. ఇది సరైనదే.. కానీ తెలుగు స్ట్రెయిట్ సినిమాలకు కన్నడ పోస్టర్లు ఎలా వేయగలరు?




అమ్మాయిల వ్యాపారితో అనీల్ అంబానీ స్నేహం
Loading..