నిన్న నవంబర్ 18 న లేడీ సూపర్ స్టార్ నయనతార బర్త్ డే. ఆమెకు సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖుల శుభాకాంక్షలతో నయన్ కు బర్త్ డే విషెస్ అందాయి. మరోపక్క ఆమె నటిస్తున్న మన శంకర వర ప్రసాద్ నుంచి ఆమె లుక్ రివీల్ చేశారు. అలాగే నందమూరి బాలకృష్ణ NBK 111 లోకి నయనతారను హీరోయిన్ గా ఆహ్వానిస్తూ వీడియో గ్లింప్స్ వదిలారు.
కన్నడ లో నయనతార నటిస్తున్న యష్ టాక్సిక్ నుంచి నయనతార లుక్ వదిలారు మేకర్స్. మరి ఇవన్నీ ఒక ఎత్తు ఆమె భర్త విఘ్నేష్ శివన్ భార్య బర్త్ డే కి ఇచ్చిన కాస్ట్లీ గిఫ్ట్ మరో ఎత్తు అన్నట్టుగా ఉంది. ఆ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఆ గిఫ్ట్ ఫొటోస్ ను భార్య నయనతార కొడుకులతో కలిసి దిగిన పిక్స్ షేర్ చేసారు.
భార్యకు స్పెషల్ గా బర్త్ డే శుభాకాంక్షలు తెలుపుతూ విఘ్నేష్ శివన్ ఓ కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చారు. రోల్స్ రాయిస్ కంపెనీకి చెందిన బ్లాక్ బ్యాడ్జ్ స్పెక్ట్రా మోడల్ కార్ ని భార్య కోసం ప్రేమగా విఘ్నేష్ కొనిచ్చాడు. ఆ కారు ధర చూసి నెటిజెన్లు షాకవుతున్నారు. విఘ్నేష్ కొన్న ఆ కారు ధర 10 కోట్లు. అన్ని పెట్టి కొని తన భార్యకు గిఫ్ట్ ఇచ్చాడు విగ్నేష్. దీంతో వామ్మో 10 కోట్లు పెట్టి బర్త్ డే కి కార్ కొన్నారా అంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు.





ఈ పాప కి ప్లాప్ లు కంటిన్యూ 
Loading..