మాలీవుడ్ లో ప్రముఖ నటి కిడ్నాప్, లైంగిక వేధింపుల ఘటన విచారణ కోసం నియమించిన జస్టిస్ హేమ కమిటీ సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా పని ప్రదేశంలో నటీమణులకు అంతగా రక్షణ లేదని, సౌకర్యాలు కూడా అంతంత మాత్రమేనని హేమ కమిటీ ఆరోపించింది. ఆ తర్వాత మాలీవుడ్ స్థబ్ధుగా ఉంది. ఇప్పుడు కోలీవుడ్ లో అనూహ్యమైన ఆరోపణ.. ప్రముఖ హీరో మేనేజర్ పై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు రావడం సంచలనమైంది.
కోలీవుడ్ సూపర్ స్టార్ ధనుష్ మేనేజర్ శ్రేయాస్ తనకు అసభ్యకర ప్రపోజల్ పెట్టాడని టీవీ నటి మాన్య ఆనంద్ ఆరోపించారు. ధనుష్ నటించే తదుపరి చిత్రంలో అవకాశం కల్పిస్తానని, అయితే దీనికి అడ్జస్ట్‌మెంట్ కావాల్సి ఉంటుందని కూడా అతడు తనకు ఆఫర్ చేసాడని సదరు నటి ఆరోపించారు. అతడు స్క్రిప్టు పంపాడు. ధనుష్ ఆఫీస్ వండర్ బార్ సంస్థ అడ్రెస్ కి సంబంధించిన గూగుల్ లింకులు కూడా పంపాడు. కలవమని అడిగాడు. అయితే కమిట్ మెంట్ ఇవ్వాలని కోరాడు! అని మాన్య ఆరోపించారు.
ఏ కమిట్ మెంట్? ఎలాంటిది? అని తాను ప్రశ్నించానని తెలిపారు. మేము నటులము.. కేవలం నటించడానికి మాత్రమే.. ఇలాంటివి కోరొద్దని, తాము కమిట మెంట్ ఇస్తే ఆ తర్వాత వేరేగా పిలుస్తారని తాను అతడితో వ్యాఖ్యానించినట్టు తెలిపారు. ప్రస్తుతానికి ధనుష్ కానీ, అతడి మేనేజర్ శ్రేయాస్ కానీ ఈ ఆరోపణలపై స్పందించలేదు. ధనుష్ ప్రస్తుతం ఆనంద్ ఎల్ రాయ్ చిత్రం `తేరే ఇష్క్ మే` రిలీజ్ ప్రచారంలో ఉన్నారు.





BB9-ఇమ్మాన్యుయేల్ ని తొక్కేస్తున్న కళ్యాణ్ 
Loading..