గత ఏడాది సంక్రాంతికి హనుమాన్ తో సెన్సేషనల్ ప్యాన్ ఇండియా హిట్ కొట్టి ఈ ఏడాది సంక్రాంతికి జై హనుమాన్ ని విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించాడు. జై హనుమాన్ కి రిషబ్ శెట్టి ని తీసుకొచ్చి అందరిని ఆశ్చర్యపరిచాడు. అంతే ఆ తర్వాత జై హనుమాన్ ఏమైపోయిందో తెలియదు. ఈ మధ్యలో ప్రశాంత్ నీల్ నుంచి మరో మూడు ప్రాజెక్ట్స్ అనౌన్సమెంట్స్ వచ్చాయి.
దానితో ప్రశాంత్ వర్మ అనౌన్సమెంట్స్ తప్ప సినిమా మొదలు పెట్టేది ఎమన్నా ఉందా అంటూ మీమ్స్ చేసారు. ఈలోపే దర్శకధీరుడు రాజమౌళి వారణాసిలో మహేష్ బాబు శ్రీరాముడు లుక్, దాని ఫోటో షూట్ గురించి మాట్లాడేశారు. దానితో మీడియా ప్రశాంత్ వర్మ జై హనుమాన్ తో తొందరపడాలి అంటూ ఆయన్ని తట్టిలేపారు.
ఆ దెబ్బకు ప్రశాంత్ వర్మ జై హనుమాన్ న్యూస్ లు మొదలైపోయాయి. రిషబ్ శెట్టి జై హనుమాన్ కోసం జనవరి నుంచి డేట్స్ ఇచ్చారు, ఆరు నెలల పాటు అంటే జనవరి నుంచి జూన్ వరకు రిషబ్ శెట్టి జై హనుమాన్ కోసం డేట్స్ కేటాయించారని.. ఆ ఆరు నెలల లోపే ప్రశాంత్ వర్మ రిషబ్ శెట్టి పార్ట్ షూట్ చక్కబెడతారని సంచారం.
ఏది ఏమైనా ఫైనల్ గా ప్రశాంత్ వర్మ కదులుతున్నాడు. అదే ఇప్పుడు హాట్ టాపిక్. హనుమాన్ విడుదలైన రెండేళ్లకు ఆయన కొత్త చిత్రం స్టార్ట్ అవుతుందన్నమాట.




డిఫ్రెంట్ వే లో వారణాసికి రాజమౌళి ప్లాన్స్ 

Loading..