ఈమధ్యన ఎన్టీఆర్-నీల్ కాంబో డ్రాగన్(వర్కింగ్ టైటిల్) పై చాలా రకాల రూమర్స్ నడిచాయి. ఇప్పటివరకు చిత్రీకరించిన అవుట్ ఫుట్ పై హీరో సంతృప్తిగా లేడు, అందుకే షూటింగ్ ఆగిపోయింది.. ఇలా ఏవేవో వార్తలు ఎన్టీఆర్ అభిమానులను డిస్టర్బ్ చేసాయి. అదేమీ పట్టించుకోకుండా చిత్ర బృందం మాత్రం తమ షూటింగ్ తాము చేసుకుంటుంది.
తాజాగా ఎన్టీఆర్-నీల్ మూవీ కేజిఎఫ్, సలార్ చిత్రాలకు మించి ఉండబోతుంది అంటూ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ చేసిన వ్యాఖ్యలు ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో జోష్ ని నింపాయి. తాజాగా రవి బస్రూర్ ఓ ఇంగ్లీష్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మట్లాడుతూ..కెజిఎఫ్, సలార్ తర్వాత ప్రశాంత్ నీల్ తో కలిసి ఎన్టీఆర్ మూవీకి వర్క్ చెయ్యడం చాలా బావుంది అన్నారు.
దర్శకుడు ప్రశాంత్ నీల్ తో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. మేమిద్దరం చాలా తక్కువ మాట్లాడుకుంటాం.. ఎక్కువ పని చేస్తాం. ఎన్టీఆర్-నీల్ చిత్రంలో విజువల్స్ తో పాటు మ్యూజిక్ కూడా భారీస్థాయిలో ఉండనుంది. ఎమోషన్స్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. నీల్ గత చిత్రాలు కేజీఎఫ్, సలార్ కంటే మ్యూజిక్ ఈ చిత్రంలో చాలా భిన్నంగా ఉండనుంది.
కొత్త మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ని ఉపయోగిస్తున్నాం. శక్తిమంతంగా ఉంటుంది. అందరూ ఈ చిత్రంలోని మ్యూజిక్ ని ఆస్వాదిస్తారు అంటూ ఎన్టీఆర్-నీల్ కాంబోపై రవి బస్రూర్ చేసిన వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి.





ముందు చిరు తర్వాత బాలయ్య 
Loading..