కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో అలరించేందుకు రెడీ అవుతుంది. ఇప్పటికే మెగాస్టార్ చిరు తో మూడో చిత్రం చేస్తుంది. మొదటగా సైరా నరసింహ రెడ్డిలో చిరు కి భార్య గా కనిపించిన నయన్ ఆతరవాత గాడ్ ఫాదర్ లో చిరు కి సిస్టర్ రోల్ చేసింది. ఇప్పుడు మెగాస్టార్ కి మాజీ భార్యగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మన శంకర్ వర ప్రసాద్ గారు లో నటిస్తుంది.
మన శంకర్ వర ప్రసాద్ గారు సంక్రాంతికి విడుదల కాబోతుంది. ఈ చిత్ర సెట్ లోకి ఎంటర్ అవడమే నయనతార క్రేజీ వీడియో తో ఎంటర్ అయ్యింది. ఇప్పుడు బాలయ్య తో మరో ఛాన్స్ అందుకుంది. గతంలో సింహ లో బాలయ్య భార్య పాత్రలో రొమాన్స్ చేసిన నయనతార మరోసారి నందమూరి బాలకృష్ణ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది. బాలయ్య-గోపీచంద్ మలినేని కలయికలో NBK 111 లో నయనతార హీరోయిన్.
ఆ విషయాన్ని నయనతార బర్త్ డే నవంబర్ 18 అంటే ఈరోజునే మేకర్స్ ఓ వీడియో తో అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. NBK 111 చిత్రం పిరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోతుంది. అందుకు తగిన లుక్ లోనే నయనతార ను పరిచయం చేసారు మేకర్స్.
ముందు చిరు అంటే ప్రస్తుతం చిరు మన శంకర్ వర ప్రసాద్ గారు కంప్లీట్ కాబోతున్న సమయంలో బాలయ్య కి జోడిగా NBK 111 సెట్ లోకి నయనతార అడుగుపెట్టబోతుంది.





రాజమౌళి పై పోలీస్ కంప్లైంట్ 
Loading..