ప్రముఖ మలయాళ నటి మీరా వాసుదేవన్ మూడో భర్తకు విడాకులిచ్చారు. 43 ఏజ్‌లో తన మూడో బ్రేకప్ గురించి ప్రకటించి షాకిచ్చారు. మీరా మలయాళంలో పలు బ్లాక్ బస్టర్ చిత్రాలలో నటించారు. ఆర్ మాధవన్ నటించిన `13బి: ఫియర్ హాజ్ ఎ న్యూ అడ్రస్` అనే హిందీ చిత్రంలో మీరా నటనకు మంచి పేరొచ్చింది. తమిళంలోను పలు చిత్రాలలో నటించిన మీరా ప్రస్తుతం మలయాళ టీవీ షో `మధురనోంబరకట్టు`లో నటిస్తున్నారు.
మీరా తన సోషల్ మీడియాలో విడాకుల గురించి ప్రకటిస్తూ, తన జీవితంలో అత్యంత అద్భుతమైన ప్రశాంతమైన జీవితాన్ని ఆస్వాధిస్తున్నానని అన్నారు. ఆగస్టు 2025 లో తన భర్త నుంచి విడిపోయానని తెలిపారు. మీరా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ విపిన్ పుతియంకంను ఏడాది క్రితం పెళ్లి చేసుకున్నారు. కొన్ని నెలలలోనే ఈ జంట విడిపోతున్నామని ప్రకటించడం షాకిచ్చింది. ప్రస్తుతం విపిన్ తో కలిసి ఉన్న ఫోటోలన్నిటినీ సోషల్ మీడియాల నుంచి మీరా తొలగించారు.
కుటుంబం విలక్కు సీరియల్ షూట్ సమయంలో విపిన్- మీరా ఒకరికొకరు కలుసుకున్నారు. ఆ తరవాత పెళ్లితో ఒకటయ్యారు. కానీ ఈ బంధం ఎక్కువకాలం నిలబడలేదు. మీరా గతంలో సినిమాటోగ్రాఫర్ అశోక్ వారసుడు విశాల్ అగర్వాల్ ని పెల్లాడారు. 2005-2010మధ్య ఈ జంట దాంపత్యం కొనసాగింది. ఆ తర్వాత రెండేళ్లకు నటుడు జాన్ కొక్కెన్ ని పెళ్లాడారు. వీరికి ఒక కొడుకు కూడా ఉన్నారు. ఈ జంటకు 2016లో బ్రేకప్ అయింది.




ఫైనల్ గా రకుల్ హిట్ కొట్టినట్లేనా

Loading..