సౌత్ లో వరస సక్సెస్ లతో స్టార్ హీరోలతో ఛాన్స్ లు అందిపుచ్చుకున్న గ్లామర్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ కి ఆతర్వాత సౌత్ ఆమెకి కంటిన్యూగా షాకులిచ్చింది. దానితో ముంబై కి పెట్టే బేడా సర్ధేసిన రకుల్ ప్రీత్ సింగ్ అక్కడే ఫిక్స్ అయ్యింది. బాలీవుడ్ లోనే అవకాశాలు వెతుక్కుంటూ సీనియర్ హీరోలకు కేరాఫ్ అడ్రెస్ గా మారింది.
సీనియర్ బాలీవుడ్ హీరోలతో సర్దుకుపోతున్న ఈ గ్లామర్ గర్ల్ కి సక్సెస్ అనే పదం చాలా దూరమైపోయింది. రకుల్ అందాల ఆరబోత యంగ్ హీరోలకు ఆనడం లేదు. అందుకే సీనియర్ హీరోలు అవకాశాలు ఇచ్చారు. కనీసం విజయం వరిస్తుందా అంటే అది లేదు. అయినప్పటికీ రకుల్ ప్రీత్ మాత్రం పట్టువదలని విక్రమార్కలా ప్రయత్నం చేస్తూనే ఉంది.
ఫైనల్లీ రకుల్ ప్రీత్ కి విజయం సొంతమైంది అనిపించేలా ఆమె రీసెంట్ చిత్రం దే దే ప్యార్ దే 2 చిత్రం కలెక్షన్స్ ఉన్నాయి. మొదటి వీకెండ్ లోనే ఈ చిత్రం 50 కోట్ల మార్క్ కి చేరుకుంది. మరి వీకెండ్ లో 50 కోట్లు అంటే ఫైనల్ గా ఈ చిత్రం ఎన్ని కోట్ల వరకు చేరుకుంటుందో అనే చర్చ అయితే అందరిలో మొదలైంది.
మరి ఈ కలెక్షన్స్ చూస్తే రకుల్ ప్రీత్ దే దే ప్యార్ దే 2 తో విజయం సొంతం చేసుకున్నట్లే కనిపిస్తుంది.




నటవారసురాలు నిరూపిస్తుందా

Loading..