బీఆర్ఎస్ పార్టీ నుంచి గెంటివేయించుకున్న కవిత తన తండ్రి కేసీఆర్ ని ఏమి అనకుండా.. అన్న కేటీఆర్ ని ఇండైరెక్ట్ గా, బావ హరీష్ రావు ని డైరెక్ట్ గానే టార్గెట్ చేస్తుంది. నిన్నటికి నిన్న జూబ్లీహిల్స్ బై పోల్ లో బీఆర్ఎస్ కాండిడేట్ సునీత మాగంటి ఓడిపోవడానికి కారణం కృష్ణార్జునులు అంటే కేటీఆర్, హరీష్ రావు అంటూ ముఖ్యంగా హారిష్ రావు ని కడిగిపారేసింది.
ముందు నుంచి కవిత ఎన్ని ఆరోపణలు చేసినా కేసీఆర్ మాటలకు కట్టుబడి హరీష్ రావు మౌనంగానే ఉంటున్నారు. లేదంటే కవితకు స్ట్రాంగ్ కౌంటర్లు పడేవి అనేది బీఆర్ఎస్ నేతల వాదన. ఇప్పుడు కవిత హరీష్ రావు ని రాజకీయంగానే కాదు పర్సనల్ గా వ్యాపారాలంటూ ఆయన్ని ఆయన భార్య ను టార్గెట్ చేసింది.
మరి కవిత కామెంట్స్ కు హరిష్ రావు కౌంటర్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. కానీ అటు వైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ కనిపించకపోయేసరికి కవిత కు కౌంటర్ వేసే ఖాళీ లేదా కేసీఆరూ, హరీష్ గారూ అంటూ కామెడీగా తెలంగాణ ప్రజలు కామెంట్లు పెడుతున్నారు.
కొంతమంది మాత్రం పుండుమీద కారం చల్లిన మాదిరి బీఆర్ఎస్ ఓటమి కన్నా ఎక్కువగా కవిత మాటలే ఇబ్బంది పెడుతున్నాయి, అందుకే వాళ్ళు కామ్ గా ఉన్నారు అంటున్నారు. ఇక కేసీఆర్ కూడా కూతురు కవిత ను అస్సలు పట్టించుకోవడమే లేదు, అందుకే ఆమెకు కౌంటర్లు వేయొద్దు అని హరీష్ రావు కు ముందే ఇనస్ట్రక్షన్స్ ఇచ్చారనే టాక్ నడుస్తుంది.





ఇంట్రెస్టింగ్: బాబు-రేవంత్ సరదా సంభాషణ

Loading..