తెలుగు రాష్ట్రాల సీఎం లు కలిసి కనిపిస్తే అభిమానులకు మత్రమే కాదు కామన్ పీపుల్ కి కూడా కనువిందే. కారణం ఒకప్పుడు ఒకే పార్టీలో గురు శిష్యులు వారిద్దరూ, ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలను సీఎం హోదాలో ఏలుతున్నారు. వారే చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి. వారి అనుబంధం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తెలంగాణ సపరేట్ అయ్యాక చంద్రబాబు ఏపీ మీద ఫోకస్ పెట్టారు. తెలంగాణాలో టీడీపీ కనుమరుగవ్వడంతో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరి సీఎం అయ్యారు.
రెండు తెలుగు రాష్ట్రాల నడుమ సయోధ్య ఉందొ, లేదంటే మరేదన్నానో అనే విషయం పక్కనపెడితే గురు శిష్యులు చంద్రబాబు-రేవంత్ రెడ్డి లు ఇద్దరూ రామోజీ ఎక్సలెన్స్ అవార్డు ప్రధానోత్సవ వేదికపై కలిసి కనిపించారు. ఈ ఈవెంట్ లో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ సహా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కిషన్ రెడ్డి కూడా హాజరయ్యారు.
చంద్రబాబు-రేవంత్ రెడ్డి పక్క పక్కనే కూర్చుని మాట్లాడుకుంటూ మధ్యలో జోక్స్ వేసుకుంటూ నవ్వుకుంటూ సరదాగా కనిపించడం ఆ ఈవెంట్ లో హైలెట్ అయ్యింది. చంద్రబాబు, రేవంత్ రెడ్డి చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా కనిపించారు. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డినవ్వుకుంటూ మాట్లాడిన వీడియో చూసిన వాళ్ళు బాబు గారు-రేవంత్ రెడ్డి బాండింగ్ చూసి కుళ్ళుకోవాల్సిందే అంటూ కామెంట్లు పెడుతున్నారు.





BB9 : తన గ్రాఫ్ తనే తగ్గించుకుంటున్న తనూజ

Loading..