భారతీయ పురాణేతిహాసాలైన రామాయణం, మహాభారతం కథల్ని సినిమాలుగా తీసేందుకు చాలా మంది దర్శకులు ప్రయత్నించారు. కొందరు పౌరాణిక కథల్లోని కొన్ని కీలక ఘట్టాలను ఎంపిక చేసుకుని వాటిని సినిమాలుగా తెరకెక్కించారు. క్లాసిక్ డేలో ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీ రంగారావు, కాంతారావు వంటి దిగ్గజ తారలు ఈ తరహా సినిమాల్లో నటించి మెప్పించారు.
మోడ్రన్ డేలో రామాయణం కథతో ఆదిపురుష్‌లాంటి వైఫల్యం కూడా ఉంది. అదంతా అటుంచితే మహాభారతం కథను ఐదు సినిమాలుగా తెరకెక్కిస్తానని ప్రకటించిన అమీర్ ఖాన్ ఆ పని చేయడంలో ఘోరంగా విఫలమయ్యాడు. రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్స్ దాదాపు 1000 కోట్ల బడ్జెట్ ని పెట్టుబడిగా పెట్టేందుకు ముందుకు వచ్చినా మహాభారత కథను టచ్ చేసేందుకు అమీర్ భయపడ్డాడు.
అయితే అమీర్ ఖాన్ చేయలేనిది రాజమౌళి చేస్తారని అంతా భావించారు. భారీ పాన్ ఇండియన్ సినిమాల మాస్టర్ మైండ్ రాజమౌళికి ఇది సాధ్యమేనని ప్రపంచం మొత్తం బలంగా నమ్ముతుంది! అయినా రాజమౌళి అంతటివాడు మహాభారతంపై సినిమాలను తీయాలంటే చాలా ఆలోచించుకుంటున్నారు. ఎప్పటికప్పుడు రామాయణం, మహాభారతం కథలపై ఆసక్తిని కనబరిచినా కానీ ప్రాక్టికల్ గా ముందుకు వెళ్లేందుకు సతమతమవుతున్నారు.
శనివారం సాయంత్రం వారణాసి టైటిల్ లాంచ్ వేడుకలో రాజమౌళి మాట్లాడుతూ- రామాయణం, మహాభారత కథలంటే తనకు చాలా ఇష్టమని, మహాభారతంపై సినిమాలు తీయాలని భావించానని కూడా అన్నారు. అయితే ఆయన ఆలోచన ప్రకారం.. పురాణేతిహాసం `మహాభారతం`పై సినిమాలు తీస్తారా లేదా? అన్నదానిపై వందశాతం క్లారిటీ ఇవ్వలేకపోవడం నిరాశపరుస్తోంది. కనీసం వారణాసి రిలీజైన తర్వాత అయినా ఆ దిశగా జక్కన్న ఆలోచిస్తే బావుంటుందని అభిమానులు సూచిస్తున్నారు.





AA 22 ఆ రెండు నెలలు కీలకం 

Loading..