AA 22 ఆ రెండు నెలలు కీలకం

Sun 16th Nov 2025 10:10 AM
allu arjun  AA 22 ఆ రెండు నెలలు కీలకం
AA22 shooting update AA 22 ఆ రెండు నెలలు కీలకం
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్ పుష్ప 2 తర్వాత కొద్దిపాటి బ్రేక్ తీసుకుని కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ తో AA22xA6 ( వర్కింగ్ టైటిల్) స్టార్ట్ చేసారు. అనౌన్సమెంట్ వీడియో తోనే హాలీవుడ్ రేంజ్ ని చూపించిన అల్లు అర్జున్ ఇంకా అట్లీ ఆతర్వాత సైలెంట్ గా తమ పని తాము చేసేసుకుంటున్నారు. చాలా సైలెంట్ గా అల్లు అర్జున్-అట్లీ ప్రాజెక్ట్ షూటింగ్ ని చక్కబెట్టేస్తున్నారు. 

AA22xA6 ని హై-కాన్సెప్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్నారు. అత్యాధునిక VFX, డిఫ్రెంట్ స్టోరీ, టెక్నీకల్ గా హాలీవుడ్ రేంజ్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అల్లు అర్జున్ యాక్షన్ సన్నివేశాలు ఇప్పటికే చిత్రీకరణ దశలో ఉన్నాయి. దుబాయ్ లోని అరుదైన లొకేషన్స్ లో అట్లీ అల్లు అర్జున్ ఇంట్రో సీన్ అలాగే యాక్షన్ సీక్వెన్స్ ని ప్లాన్ చేసారు. 

ఇక డిసెంబర్-జనవరి నుండి పూర్తి స్వింగ్ లో AA 22 షూటింగ్ జరుగుతుంది అని ఆ రెండు నెలలు చాలా కీలకంగా చిత్ర బృందం చెబుతున్నమాట. ఈ చిత్రంలో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తుండగా.. మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ పేర్లు కూడా హీరోయిన్స్ లిస్ట్ లో వినిపించడమే కాదు ఇప్పటికే వారు AA 22 షూటింగ్ లో పాల్గొన్నారని ప్రచారము ఉంది. 

AA22 shooting update:

Allu Arjun-Atlee shooting update

Tags:   ALLU ARJUN
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ