ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> The Big Surprise at the GlobeTrotter Event

GlobeTrotter ఈవెంట్లో బిగ్ సర్ ప్రైజ్ అదే

The Big Surprise at the GlobeTrotter EventThe Big Surprise at the GlobeTrotter Event

మరికొద్దిసేపట్లో హైదరాబాద్ రామోజి ఫిలిం సిటీలో మొదలుకాబోతున్న #GlobeTrotter ఈవెంట్ కోసం మహేష్ అభిమానులు ఎంతో అతృతతో బయలుదేరారు. పాస్ పోర్ట్ టైప్ లో పాస్ లు రెడీ చేసి ఇంట్రెస్టింగ్ గా క్యూఆర్ కోడ్ అంటూ అందరిలో విపరీతమైన ఆసక్తిని క్రియేట్ చేసిన రాజమౌళి ఈ ఈవెంట్ లో ఎలాంటి సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నారో అనే విషయంలో క్లూ ఇచ్చేసారు. 

#GlobeTrotter ఈవెంట్ లో మహేష్ బాబు మూవీ టైటిల్ ని విజువల్ ట్రీట్ గా చూడబోతున్నారు అంటూ రాజమౌళి ఇంతకుముందే తన సర్ ప్రైజ్ గురించిన ట్వీట్ చేసారు. మరి మహేష్ - రాజమౌళి కాంబి టైటిల్ నే ఈ రేంజ్ లో లాంచ్ చేస్తుంటే మిగతా ఈవెంట్స్ ని రాజమౌళి ఎలా ప్లాన్ చేస్తారో అనేది ఊహించడం కష్టమే. 

ఇప్పటికే విలన్ పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ లుక్, మందాకినిగా ప్రియాంక చోప్రా లుక్స్ రివీల్ చేసిన రాజమౌళి #GlobeTrotter ఈవెంట్ లో మహేష్ లుక్ తో పాటుగా టైటిల్ ని విజువల్ వండర్ గా ప్రెజెంట్ చెయ్యబోతున్నారన్నమాట. ఆ టైటిల్ ఏమిటి అనేది మరికొద్దిసేపట్లో రివీల్ అవుతుంది. 

GlobeTrotter Event Highlights

globetrotter