అవును పైరసీ భూతం iBommaనిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ అయ్యాడు. భారీ బడ్జెట్ పెట్టి సినిమాలు తీసే నిర్మాతలకు కొన్ని క్షణాల్లోనే పైరసీ చేసి ఐబొమ్మ లో అప్ లోడ్ చేసి నిర్మాతలను నష్టాల పాలు చేస్తున్న ఐబొమ్మ నిర్వాహకులను పట్టుకుంటామని తెలంగాణ పోలీసులు ఛాలెంజ్ చేసినట్టుగానే ఇమ్మడి రవి ని అరెస్ట్ చేసారు.
నిన్న శుక్రవారం ఫ్రాన్స్ నుంచి వచ్చిన ఇమ్మడి రవి ని హైదరాబాద్ కూకట్ పల్లి లో సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రవి కరీబియన్ దీవుల్లో ఉంటూ ఐబొమ్మను నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా రవి అకౌంట్లోని రూ.3 కోట్లను ఫ్రీజ్ చేశారు.
సినిమాలను విడుదలైన రోజే పైరసీ చేసి వెబ్సైట్లో పెట్టడంపై నిర్మాతలు పలుమార్లు iBomma పై కంప్లైంట్లు ఇచ్చారు. ఇమ్మడి రవిని అరెస్ట్ చేయడం ద్వారా మరో పెద్ద డొంకని కదిలించినట్టే అయ్యింది. మరి పోలీస్ విచారంలో రవి నోటి నుంచి ఇంకెన్ని నిజాలు బయటపడతాయో అని అందరూ ఎదురు చూస్తున్నారు.





అలియా భట్ - క్లాసీ అండ్ ఎలిగెంట్ 

Loading..