అఖండ 2: ఇది కదా ప్లానింగ్ అంటే..

Fri 14th Nov 2025 07:24 PM
akhanda 2  అఖండ 2: ఇది కదా ప్లానింగ్ అంటే..
Akhanda 2 Promotions Begin In Mumbai అఖండ 2: ఇది కదా ప్లానింగ్ అంటే..
Advertisement
Ads by CJ

అఖండ 2 విడుదలకు కేవలం 20 డేస్ మాత్రమే సమయం ఉంది, డిసెంబర్ 5 న అఖండ తాండవం విడుదల కాబోతుంది. బాలయ్య-బోయపాటి కాంబో అంటే బాక్సులు బద్దలైపోవాల్సిందే. అందుకే ఆ చిత్రానికి అంత క్రేజ్. అఖండ అప్పుడే పాన్ ఇండియా మార్కెట్ లోకి వెళ్ళనుకున్నా అది అప్పట్లో జరగలేదు.

ఇప్పుడు అఖండ 2ని పాన్ ఇండియా మార్కెట్ లో దించుతున్నట్టుగా అనౌన్స్ చేసారు. అంతేకాదు దానికి తగ్గ ప్లాన్స్ తో బోయపాటి ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు. ఈరోజు శుక్రవారం ముంబై లో అఖండ తాండవం సాంగ్ రిలీజ్ ని పెద్ద ఎత్తున నిర్వహించడం చూసి పాన్ ఇండియా రిలీజ్ అనడం కాదు ఇలాంటి ప్రమోషనల్ ప్లానింగ్ ఉండాలి.. ఇది కదా ప్లానింగ్ అంటే అంటూ నందమూరి అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

నిజమే పాన్ ఇండియా రిలీజ్ అంటూ పోస్టర్స్ వేసి డబ్ చేసి విడుదల చెయ్యడం తప్ప పెద్ద హీరోల సినిమాలను కూడా పాన్ ఇండియా మార్కెట్ లో ప్రమోషన్స్ చెయ్యకుండా కామ్ గా ఉండిపోతున్నారు. రాజమౌళిలా బోయపాటి కూడా ముంబై తో అఖండ 2 ప్రమోషన్స్ స్టార్ట్ చేసి అందరిలో ప్రత్యేక ఆసక్తిని క్రియేట్ చెయ్యడం 100 శాతం సక్సెస్ అయ్యారు. 

Akhanda 2 Promotions Begin In Mumbai:

Akhanda 2 Thaandavam song released

Tags:   AKHANDA 2
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ