ప్రభాస్ తన కెరీర్ స్టార్ట్ చేసి 23 ఏళ్ళు అవుతున్న సందర్భంగా ఆయన మారుతి దర్శకత్వంలో నటిస్తున్న రాజా సాబ్ నుంచి కొత్త పోస్టర్ రివీల్ చేస్తూ ప్రభాస్ కి విషెస్ తెలియజేసారు మేకర్స్. ఇప్పటివరకు రాజా సాబ్ ప్రమోషన్స్ విషయంలో అసంతృప్తితో ఉన్న ప్రభాస్ అభిమానులు సడన్ గా వచ్చిన ఈ పోస్టర్ కి థ్రిల్ అవుతున్నారు.
ఆరడుగుల కటౌట్ నడిచొస్తుంటే అది కూడా నోట్లో చుట్ట పెట్టుకుని ప్రభాస్ కనిపిస్తే ఫ్యాన్స్ కి సంతోషం కాక ఇంకేం ఉంటుంది. ఇప్పటికే రాజా సాబ్ గ్లింప్స్, ట్రైలర్ వచ్చేసాయి. ప్రభాస్ లుక్స్ రివీల్ అయ్యాయి. అయినా ఈ ప్రభాస్ 23 ఏళ్ళ కెరీర్ సందర్భంగా వదిలిన రాజా సాబ్ లుక్ లో ఏదో స్పెషల్ ఉంది అందుకే ఫ్యాన్స్ సర్ ప్రైజ్ థ్రిల్ ఫీలవుతున్నారు.
23 years of ruling hearts.
23 years of breaking barriers.
23 years of REBEL STAR #Prabhas who changed the path of Indian Cinema ❤️🔥
Team #TheRajaSaab sends best wishes on this glorious milestone 🔥 అంటూ మేకర్స్ రాజా సాబ్ లోని ప్రభాస్ లుక్ తో ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.





హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు 

Loading..