నిరంతరం మీడియా గ్లేర్.. ఎప్పుడూ లైమ్ లైట్ లో జిగ్ జాగ్ లేకపోతే సెలబ్రిటీ లైఫ్ సాగేదెలా? ఇటీవలి కాలంలో మెహ్రీన్ ఫీర్జదా ఇలాంటి మీడియా గ్లేర్ ని కోల్పోయింది. తన వెంటపడి లైవ్ కవరేజీ చేసేందుకు వెంపర్లాడిన టాలీవుడ్ మీడియా చానెళ్లలో మెహ్రీన్ ఎక్కడా కనిపించడం లేదు. సెలబ్రిటీ లైఫ్ ఎప్పుడూ ఇంతే. ఎప్పుడు ఒడిదుడుకులు ఎదురవుతాయో.. ఎప్పుడు కెరీర్ వెలిగిపోతుందో చెప్పలేం.
గత కొంతకాలంగా మెహ్రీన్ సరైన అవకాశాల్లేక ఇండస్ట్రీకి దూరంగా ఉంది. కొంత కాలంగా కేవలం ప్రయాణాలు, ఫోటోషూట్లతోనే కాలం గడుపుతోంది. అయితే నిరంతరం తన అభిమానులను అలరించే ఫోటోషూట్లను సోషల్ మీడియాల్లో షేర్ చేస్తూ అందరికీ టచ్ లో ఉంది. అలా షేర్ చేసిన రెడ్ హాట్ ఫ్రాక్ లుక్ ఇప్పుడు ఇంటర్నెట్ భగభగలు పెంచుతోంది.
ఇదంతా సరే కానీ, మెహ్రీన్ లైమ్ లైట్ కి ఎందుకు దూరం కావాల్సి వచ్చింది? నటిగా అవకాశాలు ఎందుకు తగ్గాయి? ఈ ప్రశ్నకు తనే స్వయంగా స్పందిస్తుందేమో చూడాలి. ప్రస్తుతానికి తీరిక సమయాన్ని ఆస్వాధించేందుకే మొగ్గు చూపుతున్నానని చెప్పినా ఇంకేదో కారణం ఉందని అభిమానులు నమ్ముతున్నారు. సన్ నెక్ట్స్ లో `ఇంద్ర`లో కనిపించిన ఈ బ్యూటీ ఆ తర్వత మరో కొత్త సినిమాకి సంతకం చేయలేదు. ఇంకా సరైన స్క్రిప్ట్ కోసం ఎదురు చూపుల్లోనే ఉంది. ఇక మెహ్రీన్ పెళ్లితో లైఫ్ లో సెటిలవ్వాలని ప్రయత్నించినా రకరకాల కారణాలతో ఆశించినది జరగలేదు. ఇటీవల కెరీర్ పరంగాను అంతంత మాత్రంగానే ఉండటంతో ఇప్పుడు లైఫ్ ని రిలాక్స్ డ్ గా ముందుకు సాగాలని నిర్ణయించుకుందిట.





హిట్ కోసం వెయిట్ చేస్తున్న హీరోయిన్ 

Loading..