మిస్టర్ బచ్చన్ తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే కి ఆ చిత్రం బిగ్ షాక్ ఇచ్చింది. మిస్టర్ బచ్చన్ డిజాస్టర్ అయినా భాగ్యశ్రీ బోర్సే అందాలకు అవకాశాలు వచ్చిపడ్డాయి. ఆతర్వాత శ్రీలీల వదులుకున్న అవకాశాలు భాగ్యశ్రీ బోర్సే ఖాతాలోకి వచ్ఛాయి. అలా వచ్చిన విజయ్ దేవరకొండ కింగ్ డమ్ రిజల్ట్ కూడా భాగ్యశ్రీ బోర్సే ని డిజప్పాయింట్ చేసింది.
కింగ్ డమ్ వచ్చిన కొద్దిరోజులకే మళ్లీ భాగ్యశ్రీ బోర్సే దుల్కర్ సల్మాన్ తో కలిసి కాంతా చిత్రంతో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. కాంత చిత్రం రేపు శుక్రవారమే విడుదలవుతుంది. ఈ చిత్రంతో హిట్ కొట్టాలని భాగ్యశ్రీ బోర్సే వెయిట్ చేస్తుంది. కాంతా ప్రమోషన్స్ లో అందంగా, గ్లామర్ గా కనిపిస్తుంది.
కాంతా చిత్రం వచ్చిన రెండు వారాలకే ఒకే నెల అంటే ఇదే నవంబర్ లో హీరో రామ్ తో కలిసి ఆంధ్ర కింగ్ తాలూకా చిత్రంతో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. భాగ్యశ్రీ బోర్సే ఈ చిత్ర ప్రమోషన్స్ తో అటు కాంత, ఇటు ఆంధ్ర కింగ్ తాలూకా ప్రమోషన్స్ తో భాగ్యశ్రీ బోర్సే టాలీవుడ్ లో హడావిడి చేస్తుంది. మరి ఒక్క హిట్ ఒకే ఒక హిట్ కోసం భాగ్యశ్రీ బోర్సే వెయిటింగ్.





బెడ్ రూమ్ విషయాలు హాల్ వరకూ
Loading..