బాలీవుడ్ నటుడు గోవింద భార్య సునీతా అహుజా ఎప్పుడూ నిర్మొహమాటంగా బోల్డ్ గా మాట్లాడుతూ నిరంతరం వార్తల్లో నిలుస్తున్నారు. నటుడు గోవిందతో తన వివాహం గురించి సునీత పలుమార్లు సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇప్పుడు మరోసారి, అతడు ఉత్తమ భర్త కాదని, తన నెక్ట్స్ జీవితంలో అతడిని కోరుకోవడం లేదని ఒప్పుకుంది. అంతేకాదు.. తన భర్తతో ఎదురైన చాలా అనుభవాల గురించి ఇలా ఓపెనయ్యారు సునీత.
ఒక వ్యక్తి చిన్నతనంలో తప్పులు చేయడం సహజం. నేను వాటిని చేసాను.. గోవిందుడు చేసాడు. కానీ ఒక వయస్సు వచ్చినప్పుడు, ఆ తప్పులు మీకు కనిపించవు. అలాగే మీకు అందమైన భార్య, పిల్లలు ఉన్నప్పుడు ఎందుకు అలాంటి తప్పులు చేస్తారు? అని ప్రశ్నించారు సునీత అహూజా!
ఒక స్టార్ భార్య కావడానికి చాలా బలమైన మహిళగా మారాలి. దానిని గ్రహించడానికి నాకు 38 సంవత్సరాల వైవాహిక జీవితం పట్టింది. గోవింద ఒక హీరో..నేను ఏమి చెప్పగలను? అతను తన భార్యతో కంటే హీరోయిన్లతో ఎక్కువ సమయం గడిపాడు. ఒక స్టార్ భార్య కావడానికి చాలా బలమైన స్త్రీ అవసరం. మీరు మీ హృదయాన్ని రాయిలా కఠినంగా మార్చుకోవాలి. చిన్నతనంలో నాకు అది అర్థం కాలేదు. గోవింద మంచి భర్త కాదు.. అందువల్ల రాబోవు జన్మలో అతడిని భర్తగా కోరుకోవడం లేదు.. అని అన్నారు.
గోవింద - సునీత అహూజా 1987 లో వివాహం చేసుకున్నారు. 1989 లో వారి కుమార్తె టీనా పుట్టే వరకు దానిని రహస్యంగా ఉంచారు. దశాబ్దాలుగా వారి బంధం ధృఢంగా ఉంది. కానీ ఇటీవల విడిపోతున్నారని పుకార్లు వచ్చాయి. ఆ ఇద్దరూ వేర్వేరు ఇళ్లలో నివశిస్తున్నారని కూడా కథనాలొచ్చాయి. ఈ జంట ప్రేమ వివాహం గురించి ఎంతగా చర్చ సాగిందో, అంతకుమించి ఈ జంట నడుమ ఎడబాటు, పెరిగిన దూరం గురించి అంతే చర్చ సాగుతోంది.





మస్తిష్కంలోంచి ఆ బాధలు తీసేయాలి

Loading..