సినీపరిశ్రమలో ఒంటరి జీవితాల ముగింపు ఒక్కోసారి ఆశ్చర్యపరుస్తుంది. ఒంటరితనం చివరికి డిప్రెషన్ కి దారి తీయడం, ఆపై ఆత్మహత్యలకు పాల్పడడం వంటి ఘటనలు చూస్తున్నవే. హిందీ చిత్రసీమలో ఇలాంటివి రెగ్యులర్ గా మీడియా హెడ్ లైన్స్ లో కొస్తున్నాయి. సౌత్ లో చెదురుముదురు ఘటనలు మీడియాలో హైలైట్ అవుతున్నాయి.
అయితే ఒంటరిగా ఫ్లాట్ లో నివశించే ఆర్టిస్టు తీవ్రమైన ఒత్తిడికి లోనవ్వడానికి కారణం ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. కొందరు స్టార్లు ఇంట్లో చెప్పకుండా ఇక్కడికి వచ్చి అవకాశాల కోసం ప్రయత్నిస్తారు. అయితే అలాంటి వారిలో తాను కూడా ఒకడిని అని చెబుతున్నారు నటుడు విజయ్ వర్మ. ఇటీవల తమన్నాతో డేటింగ్, బ్రేకప్ వ్యవహారాల కారణంగా ఈ నటుడి పేరు ప్రముఖంగా మీడియా హెడ్ లైన్స్ లోకొచ్చింది. తమన్నా తనను పెళ్లాడాల్సిందిగా కోరగా, అతడు తన కెరీర్ ముఖ్యమని భావిస్తున్నట్టు తెలిసింది.
ఇక విజయ్ వర్మ కరోనా లాక్ డౌన్ సమయంలో ఒంటరి తనం కారణంగా తాను ఎదుర్కొన్న డిప్రెషన్ గురించి తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. తన గదిలో తాను ఒంటరిగా కూచుని భయాందోళనలతో తీవ్ర మనోవేదనకు గురయ్యానని విజయ్ వర్మ అన్నాడు. అప్పట్లో దాహద్ షూటింగ్ జరుగుతోంది. కానీ కరోనా వల్ల ఇంట్లో కూచున్నాను. తనకు డిప్రెషన్ ఉందని గ్రహించానని విజయ్ చెప్పాడు. అయితే దీని నుంచి బయటపడేందుకు యోగా, ధ్యానం వంటివి అనుసరించానని చెప్పాడు. తన ఇంటి టెర్రాస్ పైకి వెళ్లి ప్రకృతిని, కాంతిని చూసినప్పుడు కొంత ఒత్తిడి నుంచి బయటపడ్డానని తెలిపాడు. ఆ సమయంలో అమీర్ ఖాన్ కుమార్తె ఇరా ఖాన్, నటుడు గుల్షన్ దేవయ్య తనకు చాలా సహాయం చేసారని వెల్లడించాడు. ఒత్తిడికి చికిత్స తీసుకోవాల్సిందిగా ఇరా ఖాన్ సూచించినట్టు తెలిపాడు. ఇది తనకు చాలా ఉపయోగపడిందని అన్నాడు.
ఈ ఒత్తిడి బాధ ఏదో తెలియని అపరాధ భావం నుంచి పుట్టుకొచ్చేది. దానిని మస్తిష్కంలోంచి తీసేయాలి. లేకపోతే అది అంతకంతకు పెరుగుతుందని తన అనుభవాన్ని చెప్పాడు విజయ్. తాను ఇంటి నుంచి పారిపోయి వచ్చినందుకు అది మస్తిష్కంలో బాధను పెంచి పోషించిందని తెలిపాడు. తాను చేసినది అప్పటికి సరైనదే అనిపించినా కానీ, ఇతరులకు అలా అనిపిస్తుందా? అంటూ తనను తాను ప్రశ్నించుకున్నాడు. మొత్తానికి విజయ్ వర్మ మస్తిష్కంలోంచి పాత బాధలను తొలగించాలని అనుభవ పూర్వకంగా చెప్పుకొచ్చాడు. విజయ్ ఇటీవల తమన్నా నుంచి బ్రేకప్ అయిన సంగతి తెలిసిందే.





BB9 : పాపం దివ్య మొహం మాడిపోయింది 

Loading..