క్యూట్ బ్యూటీ శ్రీలీల లుక్స్ కి, డాన్స్ కి ఫిదా కాని ప్రేక్షకుడు, అభిమాని ఉండరు. సినిమాల విషయం, ఆమె హిట్స్ విషయం పక్కనపెడితే శ్రీలీల చీర కట్టినా, లేదంటే మోడ్రెన్ వేర్ ధరించినా అందంగా కనిపిస్తుంది, ఆకర్షణగా నవ్వుతుంది. కేవలం ఆమె వాయిస్ చిన్న పిల్ల వాయిస్ లా ఉంటుంది అనే విమర్శ తప్ప శ్రీలీల కి వంక పెట్టడానికి లేదు.
రీసెంట్ గా శ్రీలీల వరంగల్ వెళ్ళింది. అక్కడ RS బ్రదర్స్ వస్త్ర దుకాణాన్ని శ్రీలీల చేతుల మీదుగా గ్రాండ్ గా ఓపెన్ చేసారు. శ్రీలీల ఈ షాప్ ఓపెనింగ్ కి చక్కటి చీరకట్టులో వెళ్లి అందరిని మెస్మరైజ్ చేసింది. షాప్ ఓపెనింగ్ లో జడ వేసుకుని ట్రెడిషనల్ గా కనిపించిన శ్రీలీల సోషల్ మీడియా లుక్ కోసం కొప్పు కట్టి అందులో నెమలి పించడం ధరించింది.
శ్రీలీల కొప్పులో నెమలి పింఛం చూసి నాట్యమాడే నెమలి.. పింఛం ధరించింది అంటూ నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు. మరి శ్రీలీల డాన్స్ గురించి స్పెషల్ గా మాట్లాడుకోవాల్సిందే. ఆమె నటించే సినిమాల్లో శ్రీలీల డాన్స్ స్టెప్స్ కి ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు. అందుకే ఇలాంటి టైటిల్ పెట్టారు నెటిజెన్లు.




BB9: తనూజకి వెన్నుపోటు పొడిచిన దివ్య 

Loading..